Salaar Teaser disappointed సలార్ టీజర్‌పై భారీ ట్రోలింగ్. ప్రభాస్ మూవీకి ఆదిపురుష్ రేంజ్‌లో.. !
టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటిసారి తెల్లవారుజామున టీజర్ ను విడుదల చేసిన ఘనత సలార్ కే దక్కుతుంది. ఫ్యాన్స్ ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక భారీ అంచనాలున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద హై లెవెల్లో సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా టీజర్ చూసిన తరువాత ఫ్యాన్స్ చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు ఇలా షాక్ ఇస్తుందని ఊహించలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
KGF 2 టీజర్ వందరేట్లు బెటర్..:సలార్ టీజర్ కోసం అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ రాత్రి మొత్తం పడుకోకుండా ఎదురుచూస్తామని ముందు నుంచే హడావుడి చేశారు. అయితే పొద్దు ప్రొద్దున్నే సినిమా టీజర్ చాలా నిరాశకు గురి చేసిందని టీజర్ చూసిన తరువాత చెబుతున్నారు. కల్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే.. సలార్ టీజర్ కన్నా కూడా KGF 2 టీజర్ వందరేట్లు బెటర్ అని అంటున్నారు. ఇంతగా నైట్ అవుట్ చేసింది పృథ్వి రాజ్ ను చూడడానికి కాదు. ప్రభాస్ ను చూడటానికి. టీజర్ లో కనీసం ఫుల్ ఇమేజ్ కూడా చూపించలేదు. సాహో క్లయిమాక్స్ షాట్స్ పెట్టారు. లిటిల్ డిస్సప్పాయింట్మెంట్ అంటూ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.

ఆ స్థాయిలో లేదని..:దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF కంటే హై లెవెల్లో సలార్ ను ప్రజెంట్ చేస్తాడని అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ముందుగానే ఈ సినిమా టీజర్ తోనే దర్శకుడు అంచనాలను హఠాత్తుగా దించేశాడు. టీజర్ కూడా ఆ స్థాయిలో లేదని ఫ్యాన్ గా చెబుతున్నా ఆ స్థాయిలో లేదని చాలా నిరాశ చెందినట్లుగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.
గ్లింప్స్ రిలీజ్ చేశారు అంటూ:ఇక మరికొందరు అయితే ఈ సినిమా టీజర్ కు బదులు గ్లింప్స్ రిలీజ్ చేశారు అంటూ కనీసం ప్రభాస్ ఫేస్ కూడా సరిగ్గా చూపించార అని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే వరుస సినిమాలతో నిరాశలో ఉండగా ఈ సినిమా టీజర్ మరింత షాక్ కు గురి చేసిందని చెబుతున్నారు. టీజర్ సినిమా రేంజ్ ను మరో లెవెల్ లో నిలబెడుతుంది అనుకుంటే ఈ తరహాలో నెగిటివ్ ఫీలింగ్ కలిగించడం అసలు బాగోలేదని చెబుతున్నారు.
KGF స్పూఫ్ లాగా ఉందని..:ఒక ప్రభాస్ అభిమానిగా సలార్ టీజర్ అసలు కిక్ ఇవ్వలేదని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమా టీజర్ KGF స్పూఫ్ లాగా కూడా ఉందని అంటున్నారు. ఇక KGF నుంచి డిలిటెడ్ సీన్ లాగా ఉందని, కన్నడ లో మరో కబ్జా అని మరికొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సాహోకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రభాస్ లుక్ ని కంప్లీట్ గా చూపించాల్సింది అని అంటున్నారు.
ప్రాజెక్ట్ K పైనే భారం వేయాలి..:బాహుబలి తరువాత ప్రభాస్ కు సరైన సక్సెస్ లేదు. సాహో రాధే శ్యామ్ రెండు కూడా షాక్ ఇచ్చాయి. ఇక లేటెస్ట్ రిలీజ్ ఆదిపురుష్ కూడా మరో డిజాస్టర్ గా నిలిచింది. ఇక సలార్ పైనే భారం వేసిన ఫ్యాన్స్ కు మొదట టీజర్ తోనే అప్సెట్ అయ్యేలా చేశారు. ఇక భారం మొత్తం ప్రాజెక్ట్ K పైనే వేయలేమో అని మరికొందరు అప్సెట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











