Salaar మూవీ రేంజ్ ఆ హాలీవుడ్ మూవీ స్థాయిలో.. ఒక్క మాటతో ప్రభాస్‌ను గాల్లోకి లేపేసిన అందాల భామ

విశాల్ వదిన శ్రేయ రెడ్డి తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు... సలార్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా చేస్తున్నాయి. ఆమె సలార్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... సలార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఆ సంగతులు ఏంటో చూద్దాం పదండి.

గతంలో నటిగా పలు సినిమాలు చేసిన శ్రేయ రెడ్డి విశాల్ సోదరుడిని వివాహం చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె... పలు సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. అయితే ఆసక్తికరంగా ప్రభాస్ హీరోగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో ఒక కీలక పాత్రలో ఆమె నటించింది. ఈ మధ్యనే తన షూటింగ్ పార్ట్ కూడా ఆమె పూర్తి చేసుకుంది.

Prabhass Salaar movie will have a game of thrones cinema kind of vibes

ఈ క్రమంలో తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సలార్ సినిమా గేమ్ ఆఫ్ త్రోన్స్ సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని ఇండియన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ అనే విధంగా ఈ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా కేజీఎఫ్ కంటే వేరే లెవెల్ లో ఉంటుందని కేజీఎఫ్ సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి అంటే ఈ సినిమాని మీ ఊహకే వదిలేస్తున్నానంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సినిమాలో ప్రభాస్ రోల్.. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంటుందని... పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు వంటి వారి పాత్రలు వేరే లెవల్ లో ఉంటాయని అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక శ్రేయ రెడ్డి ఏకంగా ఒక హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజితో ఈ సినిమాని పోల్చడంతో కచ్చితంగా ఈ సినిమాని ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారని అంచనాలు పెరిగిపోతున్నాయి.

Prabhass Salaar movie will have a game of thrones cinema kind of vibes

ఇక తాజాగా మరో ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అదేమిటంటే కేజీఎఫ్ సినిమాలోని ఈ సలార్ కి సంబంధించిన హింట్ ఇచ్చారని కేజీఎఫ్ సినిమాలో మైసూరులో ఒక వ్యక్తి ఉన్నట్టుగా చూపించారని ఆ వ్యక్తి సలార్ అయ్యుంటాడని ఇప్పుడు సరికొత్త ప్రచారం అయితే తెర మీదకు వచ్చింది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఆ మేరకు ఆసక్తికరమైన ప్రచారం అయితే జరుగుతుంది.

ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల కాబోతున్న సలార్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని సినిమా యూనిట్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది టీజర్ తో ఒక్కసారిగా ఇండియన్ సినీ లవర్స్ అందరి దృష్టిని సినిమా మీద పడే విధంగా టీజర్ కట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X