Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సలార్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.. హై వోల్టేజ్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులను ట్రాక్ లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ తరువాత రెబల్ స్టార్ తన స్పీడ్ ను మరింత పెంచనున్నట్లు అర్ధమయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో బిగ్ బడ్జెట్ సినిమా సలార్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ వేశారు. ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై కూడా అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు.
కన్ఫ్యూజన్ రూమర్స్..
సినిమాలో హీరోయిన్ గా శృతి హసన్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంత క్లారిటీ ఇస్తున్నా కూడా సలార్ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో నటించే పాత్రలకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ అభిమానులను కొంత కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూనే ఉన్నారు.
సంక్రాంతికి అనుకున్నారు.. కానీ..
రిలీజ్ డేట్ పై కూడా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట సినిమాను ఇదే ఏడాది చివరలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ కు మధ్యలో కాస్త బ్రేక్ పడటం వలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేంజ్ చేశాడు. సంక్రాంతికి అనుకున్నప్పటికి అప్పుడు ఫొటి ఎక్కువగా ఉండడం వలన వెనక్కి తగ్గారు.
హై వోల్టేజ్ పోస్టర్ తో రిలీజ్ డేట్
ఇక ఫైనల్ గా సలార్ రిలీజ్ పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు చిత్ర యూనిట్ మొత్తానికి ఎండ్ కార్డ్ పెట్టేసింది. సినిమాను 2022 ఏప్రిల్ 14 రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. బ్లాక్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ లుక్కుతో కనిపిస్తున్నాడు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
యాక్షన్ సీన్స్.. నెవర్ బిఫోర్ అనేలా..
దాదాపు KGF సినిమాకు పని చేసిన చిత్ర యూనిట్ సభ్యులే సలార్ కు కూడా వర్క్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట. ఇప్పటికే 25శాతానికి పైగా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక రిలీజ్ డేట్ పై కూడా ఏడాది ముందే క్లారిటీ ఇవ్వడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.