Don't Miss!
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'భూమ్' అంటూ ప్రభాస్ బీభత్సం.. షేడ్స్ ఆఫ్ సాహో2 రికార్డుల మోత!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ మరో చిత్రాన్ని విడుదల చేయలేదు. దీనితో సాహో కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో 2 వీడియో రికార్డుల మోత మోగిస్తోంది.
శ్రద్దా కపూర్‌కి బర్త్ డే గిఫ్ట్
ఇటీవల శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా సాహో టీం ఈ షేడ్స్ ఆఫ్ సాహో 2ని విడుదుల చేసింది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో చూపించారు. కళ్ళు చెదిరేలా యాక్షన్ సీన్స్, స్టంట్స్, తుపాకులు ఇలా అన్ని అంశాలు సాహోపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతోంది. శ్రద్దా కపూర్ కూడా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది.
తుపాకీ గురిపెట్టి
ఈ వీడియోలో శ్రద్దా కపూర్ తుపాకీ గురి పెట్టి కాల్చుతున్న సన్నివేశాన్ని చూపించారు. ఇక చివర్లో ప్రభాస్ భూమ్ అంటూ రౌడీలతో తలపడడం హైలైట్. 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో పలు దేశాలనే వణికించే దొంగగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రద్దా కపూర్ పోలీస్ పాత్రలో నటిస్తోందని అంటున్నారు.
ప్రభాస్‌ని చెంపదెబ్బ కొట్టిన అమ్మాయి.. వైరల్ అవుతున్న సంఘటన!
రికార్డుల మోత
సాహో చిత్రంపై ఎలాంటి క్రేజ్ నెలకొని ఉందో చెప్పడానికి షేడ్స్ ఆఫ్ సాహో వీడియో సోషల్ మీడియాలో సాధిస్తున్న రికార్డులే నిదర్శనం. షేడ్స్ ఆఫ్ సాహో వీడియో రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 15 మిలియన్ల వ్యూస్ సాధించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో అత్యధికంగా 79 మిలియన్ల మందికి రీచ్ అయింది. 2.9మిలియన్ల లైక్స్ సాధించింది. విడుదలైన 24 గంటల్లోనే అత్యధికంగా 12 మిలియన్ల వ్యూస్ సాధించిన మేకింగ్ విడియోగా షేడ్స్ ఆఫ్ సాహో రికార్డు సృష్టించింది. ఇప్పటికి ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
బాలీవుడ్ నటీనటులు
సాహో చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, మందిర బేడీ, జాకీ ష్రాఫ్ లాంటి ప్రముఖుల బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ ఇషాన్ లాయ్ త్రయం ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.