»   » నేను ఆయన అభిమానిని: ఆల్బం షేర్ చేసిన ప్రభాస్

నేను ఆయన అభిమానిని: ఆల్బం షేర్ చేసిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తరకెక్కిన 'బాహుబలి-ది కంక్లూజన్' మూవీ హిందీలో కూడా విడుదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హిందీ వెర్షన్ ఆడియో రిలీజ్ చేసారు.

తాజాగా హిందీ ఆల్బమ్ ను తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసిన ప్రభాస్..... నేను కైలాష్ ఖేర్ అభిమానినని.... 'బాహుబలి-2'లో తనకు ఇష్టమైన హిందీ పాటను కైలాష్ ఖేర్ పాడాడని, ఈ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని ఆ పోస్ట్ లో ప్రభాస్ పేర్కొన్నాడు.

జయ్ జయ్ కర

ప్రభాస్ షేర్ చేసిన హిందీ ఆల్బమ్ ఇదే. ఆల్బంలో మొత్తం 5 పాటలున్నాయి. ఇందులో Jay Jaykara అనే సాంగును కైలాష్ ఖేర్ పాడారు.

మిర్చి

మిర్చి

గతంలో ఖైలాష్ కేర్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి' చిత్రంలో పండగలా దిగివచ్చావు అనే సాంగును పాడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమాతో పాటు పాటు ఆ పాట కూడా సూపర్ హిట్టయింది.

‘బాహుబలి 2'

‘బాహుబలి 2'

బాహుబలి 2 మూవీ ఏప్రిల్ 28న విడుదలవ్వబోతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం ఇలా పలు ప్రాంతీయ బాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈసారైనా తమకు లాభాలొస్తాయని నిర్మాతల ఆశ

ఈసారైనా తమకు లాభాలొస్తాయని నిర్మాతల ఆశ

బాహుబలి రెండు పార్టులు కలిపి దాదాపు రూ. 450 కోట్లు ఖర్చు పెట్టారు. తొలి భాగం ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే తొలి భాగంలో తమకు పెద్దగా లాభాలు మిగల్లేదని, డిస్ట్రిబ్యూటర్లకే లాభాలు వచ్చాయని.... రెండో భాగంపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. పార్ట్ 2 వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

English summary
"Always a fan of Kailash Kher.. He sung my fav song in the Hindi album of #Baahubali2.. Hope you all like it" Prabhas said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu