జాతిరత్నాలు హీరోయిన్ హైట్ చూసి షాకైన ప్రభాస్.. ఈవీడేంటి ఇంత పొడుగుంది అంటూ

సోషల్ మీడియాలో ప్రస్తుతం జాతిరత్నాలు పేరు మారు మారుమ్రోగిపోతోంది. ముఖ్యంగా యూత్ లో సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎదో సంచలనం క్రియేట్ చేసేలా ఉందని వస్తున్న క్రేజ్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. మార్చ్ 11న రానున్న ఈ సినిమాకు ప్రభాస్ కూడా తనవంతు ప్రమోషన్ చేశాడు. ముంబైకు వెళ్లిన జాతిరత్నాలు టీమ్ ప్రభాస్ ను చూసి షాక్ అయ్యింది. అయితే అక్కడ హీరోయిన్ హైట్ చూసి ప్రభాస్ కూడా షాక్ అయ్యాడు.

 మహానటి దర్శకుడు నిర్మాతగా..

మహానటి దర్శకుడు నిర్మాతగా..

జాతిరత్నాలు హవా ఇప్పుడు మామూలుగా లేదు. దానికి తోడు కామెడీ గానే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సినిమాను వైజయంతి వారి స్వప్నా సినిమాస్ లో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. పిట్టగొడ దర్శకుడు అనుదీప్ సినిమాకు దర్శకత్వం వహించగా రాధన్ మ్యూజిక్ అంధించాడు. ఇప్పటికే చిట్టి అనే సాంగ్ యూ ట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇక టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్

ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్

జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ రోజు విడుదల చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం ద్వారా నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ ను కలిసి జాతిరత్నాలు సినిమా గురించి వివరించాడట.

 ప్రభాస్ ను కూడా పర్ఫెక్ట్ గా..

ప్రభాస్ ను కూడా పర్ఫెక్ట్ గా..

ప్రభాస్ ను కూడా జాతి రత్నాలు టీమ్ చాలా పర్ఫెక్ట్ గా వాడుకున్నట్లు అర్ధమయ్యింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముందుగా హీరో నవీన్ పోలిశెట్టి తన అల్లరితో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

ప్రభాస్ సర్ ప్రైజ్

ప్రభాస్ సర్ ప్రైజ్

ఇక ట్రైలర్ లాంచ్ కోసమని చిత్ర యూనిట్ ముంబైకు వెళ్లింది. అక్కడ ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక జాతిరత్నాలు టీమ్ అల్లరి చేస్తుండగా సడన్ గా వెనకాల నుంచి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ చిత్ర యూనిట్ తో సరదగా మాట్లాడారు. ట్రైలర్ ను చూసి బాగా ఎంజాయ్ చేసినట్లు కూడా వివరణ ఇచ్చారు.

ఆమె హైట్ కు షాకైనా ప్రభాస్

ఆమె హైట్ కు షాకైనా ప్రభాస్

అయితే హీరోయిన్ ఫారియా అబ్దుల్లా హైట్ చూసి ప్రభాస్ షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఫారియా పేరు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతోంది. చిట్టి నీ నవ్వంటే పాటలో అమ్మాయి క్యూట్ గా కనిపించడంతో ఆడియెన్స్ ఆమెకు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. ఫారియా కూడా ఇటీవల సినిమా కోసం ఒక రైతు బజార్ లో ప్రమోషన్ కూడా చేసింది అందరిని ఆకట్టుకుంది.

హీరోయిన్ పై ప్రభాస్ కామెంట్

హీరోయిన్ పై ప్రభాస్ కామెంట్

ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఈ హీరోయిన్ హైట్ చూసి స్టన్ అయ్యాడు. ఆమె పక్కన నిలబడి హైట్ చెక్ చేసుకోవడమే కాకుండా చాలా ఫ్రీగా మాట్లాడాడు. "ఈవీడేంటి ఇంత పొడుగుంది" అంటూ నేచురల్ గా స్పంధించడంతో వీడియో వైరల్ గా మారింది. చూస్తుంటే ప్రభాస్ కు అలాంటి అమ్మాయి హీరోయిన్ గా సెట్టయితే పర్ఫెక్ట్ జోడి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X