రాజమౌళి నమ్మేది పిచ్చోళ్ళు మాత్రమే.. ముసలోళ్ళు అయిపోతారు అంటున్న ప్రభాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులున్న క్రేజీ హీరో. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ ఓ సంద్భరంలో రాజమౌళి గురించి మాట్లాడుతూ సరదగా కామెంట్స్ చేశాడు. రాజమౌళి బాహుబలి రెండు భాగాలని చిత్రీకరించాడని దాదాపు ఐదేళ్ళ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏదో సాధించాలనే తపన
ఒక చిత్రం కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించడం ఎవరివల్లా కాదు. కానీ రాజమౌళితో ఏదో సాధించాలనే తపన ఉంది. రాజమౌళిని నమ్మే హీరోల విషయానికి వస్తే మాత్రం పిచ్చోళ్లనే అంటాను. ఎందుకంటే రాజమౌళిని నమ్మేది పిచ్చోళ్లు మాత్రమే. ఈరోజుల్లో ఒక చిత్రానికి ఐదేళ్లు కేటాయించడం చాలా కష్టం అని రాజమౌళి తెలిపాడు.

ముసలోళ్ళు అయిపోతాం
ఒక్కో చిత్రణకి నాలుగేళ్లు, ఐదేళ్లు కేటాయించుకుంటూ పోతే 4 సినిమాలు చేసే సరికి ముసలోళ్ళు అయిపోతాం అని ప్రభాస్ తెలిపాడు. దర్శకులుగా, నిర్మాతలుగా 80 ఏళ్ల వయసులో కూడా పనిచేయవచ్చు. కానీ హీరోగా, హీరోయిన్ గా నటించాలంటే మాత్రం వయసులోనే అని ప్రభాస్ తెలిపాడు. ఐదేళ్ల పాటు తెరకెక్కించినంత మాత్రాన ఆ సినిమా పరిస్థితి ఏంటో చెప్పలేం. కానీ బాహుబలికి అది వర్కౌట్ అయిందని ప్రభాస్ తెలిపాడు.

బాగా తెలిసొచ్చిందా
బాహుబలి చిత్రం అనే ప్రపంచంలో ప్రభాస్ దాదాపు ఐదేళ్ల పాటు గడిపాడు. దీనితో ప్రభాస్ కు బాగా తెలిసొచ్చినట్లు ఉంది. ఇక రాజమౌళి కూడా సినిమాల విషయంలో వేగం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి నుంచి తదుపరి వచ్చే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏడాదిన్నర లోపే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో బాహుబలి లాంటి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం అదే తొలిసారి. ఇప్పుడు రాజమౌళికి ఆర్ఆర్ఆర్ విషయంలో బాహుబలి అనుభవం ఉపయోగపడుతుంది.

వరుసగా సినిమాలు చేస్తూ
బాహుబలి తర్వాత ప్రభాస్ వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. సాహో చిత్రీకరణలో ఉండగానే రాధాకృష దర్శత్వంలో మరో చిత్రాన్ని అంగీకరించాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ రెండు చిత్రాలు ఏడాదే విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











