క్లైమాక్స్‌లో ప్రభాస్ ‘వారధి’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతు చిత్రం 'వారధి'. రచయిత కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల రామోజీ పిల్మ్ సిటీలో, కొత్త పేటలోని మర్యాద రామన్న ఇంట్లో షూటింగ్ పూర్తి చేసుకోగా.....ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ జరుగుతోంది.
వారధి చిత్రానన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ చిత్రం ద్వారా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.
దీంతో పాటు ప్రభాస్ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' చిత్రంలో నటిస్తున్నాడు. రెబల్ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











