ప్రభాస్ రియల్ లైఫ్ విలన్స్ గురించి కూడా తెలుసుకోవాలి: హైకోర్ట్ ఆసక్తికర వ్యాఖ్య
Recommended Video

టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధి సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివాదంలో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించగా... దీనికి సంబంధించిన వాదనలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు ప్రభాస్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. ఇంతకీ కోర్టు ఏం చెప్పిgదో ఓ లుక్కేద్దాం....

రీల్ లైఫ్ విలన్లు చూసి ఉంటారు...రియల్ లైఫ్ విలన్ల గురించి కూడా తెలుసుకోవాలి
‘క్లయింట్(ప్రభాస్) రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొని ఉంటారు... కానీ రియల్ లైఫ్ విలన్లు భిన్నంగా ఉంటారు అనే విషయం కూడా తెలుసుకోవాలి' అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తండ్రి కొన్న స్థలం అది
గెస్ట్ హౌస్ ఉన్నస్థలం ప్రభాస్ తండ్రి గతంలో కొనుగోలు చేశారు. దాన్ని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అధికారులకు ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభాస్ దరఖాస్తుపై స్పందించకుండా... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేసిన రెవెన్యూ అధికారుల తీరును కోర్టు ప్రశ్నించింది.

ఎటూ తేలని వివాదం
హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెం. 46 సర్వే నెంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉండగా చాలా మంది కొనుగోలు చేశారు. ఇందులో ప్రభాస్‌కు 2,200 గజాల్లో గెస్ట్ హౌస్ ఉంది. ఇది ప్రభుత్వ స్థలం అని అధికారులు వాదిస్తుంటే ఇది మాదే అని ఇందులో స్థలాలు ఉన్నవారు అంటున్నారు. ఈ స్థలం చుట్టూ చాలా వివాదాలు ఉండటంతో ప్రభాస్ స్థలం వివాదం కూడా ఎటూ తేలలేదు.

సాహో
కాగా... ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











