ఆమె లేకపోతే కష్టమే.. నిజంగా అదృష్టమే.. ప్రభాస్

By Rajababu

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా ప్రభాస్ సరసన నటిస్తున్నది. ఈ చిత్రంలోని శ్రద్ధా కపూర్ పోషిస్తున్న పాత్రపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ.. శ్రద్దా కపూర్ రోల్ గురించి వివరించారు. ఇంతకీ శ్రద్దాకపూర్ గురించి బాహుబలి ఏమి చెప్పారంటే..

 సాహోలో కీలక పాత్ర

సాహోలో కీలక పాత్ర

సాహో చిత్రంలో శ్రద్ధాకపూర్‌ది చాలా కీలకమైన పాత్ర. కేవలం పాటలకు, డ్యాన్స్‌ల కోసం ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేదు. చాలా రోజులుగా ఆమెతో పనిచేస్తున్నాం. ఆ పాత్రకు శ్రద్ధా కరెక్ట్ చాయిస్ అనిపిస్తున్నది అని ప్రభాస్ పేర్కొన్నాడు.

శ్రద్దాది రొటీన్ పాత్ర కాదు

శ్రద్దాది రొటీన్ పాత్ర కాదు

నేను బాలీవుడ్ నటితో ఇంతకు ముందు పనిచేయలేదు. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ఉండటం నిజయంగా అదృష్టమే. పాటల్లో ఆడిపాడటానికి అలా వచ్చి.. ఇలా వెళ్లే రోటీన్ పాత్ర ఆమెది కాదు అని ప్రభాస్ చెప్పారు.

 శ్రద్ధా ఫైట్స్ కూడా

శ్రద్ధా ఫైట్స్ కూడా

సాహో చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీన్లు ఉంటాయి. హాలీవుడ్ ప్రమాణాలకు తగినట్టుగా ఫైట్స్ ఉంటాయి. అలాంటి యాక్షన్ సీన్లలో శ్రద్దాకపూర్‌ నటిస్తున్నది. ఈ చిత్రంలో ఆమెది బలమైన క్యారెక్టర్ అని ప్రభాస్ అన్నారు.

 శ్రద్దా హార్డ్‌వర్క్, డిడికేషన్

శ్రద్దా హార్డ్‌వర్క్, డిడికేషన్

సెట్లో శ్రద్దా అంకితభావం, హార్డ్ వర్క్ అందరిని ఆకట్టుకొంటున్నది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలని పడుతున్న తపన అద్భుతంగా ఉంది. దక్షిణాదిలో నటించి, గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్‌కు పరిచయమైన వారితో పనిచేశాను. శ్రద్ధా ఇప్పటికే హిందీలో స్టార్ హీరోయిన్. అలాంటి హీరోయిన్‌తో నటించడం గొప్ప అనుభూతి అని ప్రభాస్ వెల్లడించాడు.

Recommended Video

Prabhas' Saaho Heroine Finally Confirmed
 ఫైట్స్ చిత్రీకరణలో సాహో

ఫైట్స్ చిత్రీకరణలో సాహో

సాహో చిత్రం షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో శ్రద్ధాకపూర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెలస్‌ పర్యటనలో నేను ఉన్నాను. ప్రభాస్ త్వరలోనే ఈ షూటింగ్‌లో భాగమవుతాను.

 త్వరలోనే రిలీజ్ డేట్

త్వరలోనే రిలీజ్ డేట్

తాజా షెడ్యూల్ ఎడతెరిపి లేకుండా 45 రోజులుపాటు సాగుతుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చిత్ర షూటింగ్ సరళిని బట్టిని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అని ప్రభాస్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X