సాహో: ప్రభాస్, శ్రద్ధా కపూర్ రొమాంటిక్ పిక్ లీక్!
Recommended Video
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'సాహో' మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.
ప్యాన్ ఇండియా మూవీ కావడంతో... బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా, నీల్ నితిన్ ముఖేష్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. వీరితో పాటు అరుణ్ విజయ్, జాకీష్రాఫ్ లాంటి వారు సైతం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ప్రభాస్, శ్రద్ధా కపూర్ రొమాంటిక్ పిక్ లీక్!
ఇప్పటికే ‘సాహో' చిత్రానికి సంబంధించి ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్ అఫీషియల్‌గా విడుదల చేశారు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ మాత్రం చిత్ర బృందం ఇంకా బయట పెట్టలేదు. తాజాగా హీరో, హీరోయిన్‌కు సంబంధించిన రొమాంటిక్ పిక్ ఒకటి ఇంటర్నెట్లో లీక్ అయి వైరల్ అయింది.

అదిరిపోయే రేంజిలో లవ్ సీన్స్
సినిమాలో కేవలం భారీ యాక్షన్ మాత్రమే కాదు... ప్రభాస్, శ్రద్ధా కపూర్ మధ్య అదిరిపోయే రేంజిలో లవ్ సీన్స్ ఉండబోతున్నాయి. లీకైన ఈ రొమాంటిక్ ఫోటోలే నిదర్శనం. వీరిపై చిత్రీకరించిన ఓ పాటలో నుంచి ఇది లీక్ అయినట్లు తెలుస్తోంది.

స్పై థ్రిల్లర్
‘సాహో' చిత్రాన్ని స్పై థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం. బాహుబలి మాదిరిగానే ఈ చిత్రాన్ని సైతం జపాన్లో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ప్రభాస్ సినిమాలకు భారీ డిమాండ్ ఉండటమే కారణం. యంగ్ రెబల్ స్టార్ అక్కడకు వెళ్లి స్వయంగా సినిమాను ప్రమోట్ చేయబోతున్నారట.

హాలీవుడ్ స్థాయిలో
‘సాహో' చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ స్టంట్స్, విజుల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులు అబ్బురపడేలా ఉండబోతున్నాయట. ఈ చిత్రానికి మధి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శంకర్ ఎస్సాన్ లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. యూవి క్రియేషన్స్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











