Prabhas సలార్ రిలీజ్ మేనియా... ప్రభాస్ మరదలు వీడియో వైరల్.. ఎవరో తెలుసా?

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక సలార్ సినిమాతో తీరిపోయింది. ఒక సాలిడ్ హిట్ పడితే బ్రేక్ ఇవ్వడానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు మిగిలిన కోరిక ఒక్కటే. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. సలార్ రిలీజ్ కు ముందు ప్రభాస్ మరదలు వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలే ప్రభాస్ ఫ్యాన్స్ హిట్ కోసం ఆకలితో ఎదురుచూస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న మూవీ పడితే.. ప్రభాస్ కు సాలిడ్ హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎలివేషన్ కా బాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రభాస్.. సలార్ సినిమాతో వచ్చాడు. ఇక ఈ సినిమా అర్ధరాత్రి నుంచి షోలు ప్రదర్శించారు. ఇక ఫ్యాన్స్ నిద్రను మానుకోని మరి ప్రభాస్ కోసం తరలివచ్చారు.

Prabhas Sister in Law Video Gone Viral Before Salaar Release

ఏ థియేటర్ చూసిన హౌస్ ఫుల్, ఇక ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి బహుబలి రేంజ్ హిట్ కొట్టేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు రూ.200 కోట్ల వసూళ్లు ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పటికే వంద కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ అయిన సంగతి తెలిసిందే. మరి 200 కోట్లు రాబట్టడం ఖాయం అని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా మొత్తం మీద రూ.1000 కోట్ల రూపాయలు వసూలు చేయనుందని అంచనా.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ హిట్ కొట్టాడు.. ఫ్యాన్స్ హ్యాపీ. కానీ ప్రభాస్ పెళ్లి అయితే కూడా చూడాలని ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట మాట్లాడటం లేదు. అయితే ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. 2024లో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని ఆ మధ్య బోనాల పండక్కి మీడియాతో చెప్పుకువచ్చారు. ఇది ఇలా ఉంటే... ఇప్పుడు సలార్ విడుదలకి ముందు ప్రభాస్ మరదలు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.

Prabhas Sister in Law Video Gone Viral Before Salaar Release

అసలు విషయం ఏంటంటే... ప్రభాస్ కు దగ్గరి బంధువు అయిన ఓ అమ్మాయిని యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ వీడియోలో యాంకర్ ఆమెను ప్రశ్నిస్తూ... మీరు ప్రభాస్ గారి మరదలే కదా.. అని అడుగుతాడు. అంతే కాదు.. మీరు ప్రభాస్ బర్త్ డేకి విషెస్ చెబుతూ 'బావ' అంటూ పోస్టు కూడా పెట్టారంట అని ఆ అమ్మాయిని అడుగుతాడు. దీని ఆమె మాట్లాడుతూ.. నేను కేవలం నా ఫోన్ లో స్టేటస్ మాత్రమే పెట్టుకున్నానని చెప్తుంది. అంతేగాని ఆయనికి డైరెక్ట్ గా మెసేజ్ చేసే సీన్ లేదని అంటుంది.

ఇక ఆ అమ్మాయి.. ప్రభాస్ వరుసకు మరదలు అవుతుందట. ఈ విషయాన్ని ఆమె ఒప్పుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్... ప్రభాస్ అన్న మరదలు.. వదినమ్మ అంటూ ఆ వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఈ ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X