For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ కొత్త లాంబోర్గినిలో చెల్లెలు షికార్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

  |

  బాహుబలి తర్వాత పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఉండేలాగా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన జిల్ ఫేం దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా షూట్ కూడా పూర్తిగా కాక మునుపే ప్రభాస్ మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు.

  Prabhas Lamborghini Aventador On Hyderabad Roads | తండ్రి పుట్టినరోజున..!!

  నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇవి కాక బాలీవుడ్ లో డైరెక్ట్ గా ఆదిపురుష్ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. వరుస షూటింగ్ నేపథ్యంలో ఆయన బిజీ బిజీ గానే గడుపుతున్నాడు.

  కొత్త లాంబోర్గినీ కారులో షికార్లు

  కొత్త లాంబోర్గినీ కారులో షికార్లు

  అయితే ఈ మధ్య కాలంలో ఆయన కొత్త లాంబోర్గినీ కారు కొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ తన తండ్రి జయంతి సందర్భంగా ఈ కారు కొనుక్కున్నాడు. పూర్తిగా ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ కారు దాదాపు ఆరున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల రూపాయల దాకా ధర పలికింది. కారు కొనుక్కున్న కొత్తలో ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  సోషల్ మీడియాలో వైరల్

  సోషల్ మీడియాలో వైరల్

  అయితే అప్పట్లో కేవలం కారు ఫోటోలు మాత్రమే బయటకు వచ్చే కానీ తాజాగా కారుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు - శ్యామల దేవి దంపతుల కుమార్తె ఆయన ప్రసీద కారులో బయటకు వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. నిజానికి ఈ వీడియో లు స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామల దేవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

  ఆకట్టుకుంటున్న లంబోర్ఘిని

  చూడడానికి ప్రకాశవంతమైన నారింజ రంగులో.. స్పోర్ట్స్ కారులానే ఉన్న ఈ కారు అందరినీ ప్రేమికులను ఆకట్టుకుంటుంది. లంబోర్ఘిని అవెంటడార్ రోడ్‌స్టర్ బెంగళూరులోని లంబోర్ఘిని షోరూమ్‌ నుంచి హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఇంటికి ఇటీవలే కారును డెలివరీ చేయగా.. ఆల్రెడీ కారుతో హైదరాబాద్‌ రోడ్లు మీద ప్రభాస్ చక్కర్లు కొట్టినట్లు చెబుతున్నారు. అయితే అందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి కానీ, ప్రభాస్ అందులో ఉన్నాడో లేదో క్లారిటీ లేదు.

  రాధేశ్యామ్ పనుల్లో బిజీగా ప్రసీద

  రాధేశ్యామ్ పనుల్లో బిజీగా ప్రసీద

  ప్రసీద ప్రస్తుతం తండ్రి కి సంబంధించిన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా యువి క్రియేషన్స్ అలాగే గోపి కృష్ణ బ్యానర్ మీద సంయుక్తంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ తరఫు నుంచి అన్ని వ్యవహారాలు ప్రసీద చూసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించడమే కాక సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

  రాధేశ్యామ్ రిలీజ్ దగ్గర పడడంతో

  రాధేశ్యామ్ రిలీజ్ దగ్గర పడడంతో

  నిజానికి సాహో సినిమా అనుకున్నంత మేర అంచనాలను అందుకోలేక పోవడంతో తరువాతి సినిమా మీద ప్రభాస్ చాలా దృష్టి పెట్టాడు. బడ్జెట్ లో కోత విధించాలని భావించి చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఆపేసి మరి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అనంతరకాలంలో కరోనా వచ్చి పడడంతో ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక కొంతమేర ప్యాచ్ వర్క్ మినహా మిగతా షూటింగ్ అంతా అయిపోయినట్లు సమాచారం. ఎలా అయినా ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నా దర్శక నిర్మాతలు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీద శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారు.

  English summary
  Prabhas recently took the delivery of a Lamborghini, that too a special one; according to media reports, the actor has purchased Aventador S Roadster, which retails around ₹6 crore. Recently Prabhas Sister Praseedha Uppalapati goes for a ride in his new Lamborghini.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X