twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాపై పోరాటానికి ప్రభాస్ సిస్టర్స్.. ఏం చేస్తున్నారో తెలుసా?

    |

    ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్‌పై పోరాటానికి అన్ని వర్గాల సమాయత్తం అవుతున్నాయి. పేద ప్రజలు, రోజువారీ సినీ కార్మికుల కష్టాలను తమ కష్టాలుగా చేసుకొని సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇబ్బంది పడుతున్న ఎంతో మంది కార్మికులను ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం కూడా భాగమైంది. తాజాగా ప్రభాస్ సోదరిమణులు కూడా ముందుకు రావడం విశేషం. వివరాల్లోకి వెళితే..

    కరోనావైరస్ కరాళ నృత్యం

    కరోనావైరస్ కరాళ నృత్యం

    ప్రధాని మోదీ పిలుపు మేరకు లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రపంచమంతా కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది.

    విపత్కర పరిస్థితులను అధిగమించడానికి

    విపత్కర పరిస్థితులను అధిగమించడానికి

    ఈ సందర్భంగా కృష్ణంరాజు తమ కుటుంబ సభ్యుల గురించి వివరిస్తూ.. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు అని అన్నారు.

    మా ముగ్గురు అమ్మాయిలు

    మా ముగ్గురు అమ్మాయిలు


    మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము చేసిన పొదుపు నుంచి విరాళాలు ఇచ్చారు. తమ పాకెట్ మనీ నుంచి తలా రూ.2 లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు ఇస్తామని ముందుకు వచ్చారు. వారు తీసుకొన్న నిర్ణయం చాలా సంతోషం కలిగించింది. చిన్న వయసులోనే పెద్ద మనసును చాటడం ఆనందంగా ఉంది అని కృష్ణంరాజు అన్నారు.

    నా భార్య కూడా 4 లక్షల విరాళం

    నా భార్య కూడా 4 లక్షల విరాళం

    అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా రూ.4 లక్షలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి మన ప్రియతమ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు స్పందించినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్న నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది అని అన్నారు .

    English summary
    Prabhas Sisters donations for Coronavirus fight. Prabhas Sister Sai Praseeda, Sai Prakeerthy, Sai Pradeepthy donated their pocket money Rs.2 Lakhs to PM Relief fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X