Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫైనల్గా నా డ్రీమ్ నిజమవుతోంది.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్
రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు ఎలాంటి స్టార్ట్స్ అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అంటున్నారు. వైజయంతి ప్రొడక్షన్ లో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్న ప్రభాస్ చాలా రోజుల తరువాత ఆ ప్రాజెక్ట్ పై స్పందించాడు. మొత్తానికి నా డ్రీమ్ నెరవేరబోతోందని ప్రభాస్ చెప్పిన విధానం నెటిజన్లను ఆమితంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ ని ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ముందుగా ఆయనది గెస్ట్ రోల్ అని రూమర్స్ రాగా అలాంటిదేమి లేదని అమితాబ్ బచ్చన్ సినిమా మొత్తంలో ఉంటారని నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చారు. ఇక ప్రభాస్ కూడా స్పందిస్తూ నా జీవితంలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఫైనల్ గా నా కల నెరవేరుతోందని అన్నారు. అందుకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ గా స్పందించారు.
ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో బాగమవుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇక వైజయంతి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మరో 50 ఏళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను.. అంటూ అమితాబ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ సైన్స్ ఫిక్షన్ కథలో హీరోయిన్ గా దీపిక పదుకొన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే ఏడాది జనవరి అనంతరం మొదలు పెట్టి సినిమాను 2022లో గ్రాండ్ గా ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.