యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కరోనా వైరస్ కష్టాలు..
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ భయం ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలను వెంటాడుతున్నది. సగటు పౌరుల నుంచి సెలబ్రిటీలను కరోనా పేరు ఎత్తితే ఉలిక్కిపడుతున్నారు. సెలబ్రిటీలు, సినీ తారలు కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తాజా ప్రభాస్ ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం యూరప్ వెళ్తూ ఇలా మీడియా కంట పడ్డారు.
Recommended Video


కరోనా వైరస్ బారిన పడకుండా
హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభాస్ గట్టిగానే జాగ్రత్తలు పాటించినట్టు కనిపించాడు. అభిమానులు కూడా గుర్తు పట్టకుండా యూరప్‌కు వెళ్తూ ముఖానికి మాస్క్ ధరించాడు. ఇక మార్చి 15వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ప్రారంభం కానున్నది.

యూరప్‌లో షూటింగ్
సాహో చిత్రం అనంతరం ఇప్పుడు జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణతో చేస్తున్న చిత్రంపై పూర్తిగా దృష్టిని సారించాడు. పిరియాడికల్ లవ్ స్టోరికి సంబంధించిన కథ డిమాండ్ చేయడంతో ప్రధాన భాగం యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ సినిమా ఇన్సిపిరేషన్ అని తెలుస్తున్నది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది.

రాధే శ్యామ్ అనే టైటిల్‌తో
గతంలో జాను అనే పేరుతో వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు. అయితే దిల్ రాజు కోరిక మేరకు ఆ టైటిల్‌ను ఇవ్వడంతో మరో టైటిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సినిమా కోసం రాధే శ్యామ్, ఓ డియర్ అనే టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారు.

పక్కా లవ్‌స్టోరీగా
ఇటీవల ప్రభాస్‌తో చేస్తున్న సినిమా గురించి దర్శకుడు రాధాకృష్ణ స్పందించారు. ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోయే పక్కా లవ్ స్టోరి. ఈ సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కిస్తున్నాం. ఎక్కువ భాగం ఈ సినిమాను యూరప్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం అని దర్శకుడు రాధాకృష్ణ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











