ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు: ముద్దు సీన్ అంటే వాళ్ల నాన్నకు ఫొన్ చేశాడట...

By Bojja Kumar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... చాలా సిగ్గరి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్‌తో ఓ పది నిమిషాలు మాట్లాడిన ఎవరైనా ఈ విషయాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు. బాహుబలితో నేషనల్ లెవల్ స్టార్ హీరోగా ఎదిగినా ప్రభాస్‌లో ఎందుకనో ఈ సిగ్గు మాత్రం పోలేదు. ప్రభాస్‌తో స్నేహం కారణంగా తన స్క్రీన్ నేమ్ కూడా ప్రభాస్ శ్రీనుగా పెట్టుకుని పాపులర్ అయిన నటుడు శ్రీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

 ప్రభాస్‌తో పరిచయం గురించి...

ప్రభాస్‌తో పరిచయం గురించి...

నాకు చదువు సరిగా అబ్బక పోవడంతో ఇంట్లో వారు మధు యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారని, ఆ తర్వాత మా నాన్న గారు వైజాగ్ సత్యానంద్ దగ్గర జాయిన్ చేశారని, అక్కడ తాను ప్రభాస్‌తో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నట్లు ప్రభాస్ శ్రీను తెలిపారు.

ప్రభాస్‌లా ఎవరూ ఉండలేరు

ప్రభాస్‌లా ఎవరూ ఉండలేరు

నాకు ఇన్స్‌స్పిరేషన్ ప్రభాస్ గారే, అతి చిన్న వయసులో చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. ఈ ఏజ్‌లో ఇవన్నీ ఎలా డార్లింగ్ అని అడిగితే.... అనుభవిస్తే తెలుస్తుంది అంటారు. ఆయనకు ఓపిక చాలా ఎక్కువ. ఆ వయసులో అంత ఓపిక ఎవరికీ ఉండదు. ఆయనలా ఉండలేరు. అంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అందరి గురించి ఆలోచించే ఓపిక భగవంతుడు ఆయనకు ఇచ్చాడు.... అని ప్రభాస్ శ్రీను తెలిపారు.

 బుద్దుడి విగ్రహంలా ఉండిపోతాడు

బుద్దుడి విగ్రహంలా ఉండిపోతాడు

ప్రభాస్‌కు ఉండే ఓపికలో 10శాతం ఉన్నా చాలు సక్సెస్ అవ్వడానికి.... కానీ అలా ఉండలేం. సినిమా ఇండస్ట్రీలో చాలా టెన్షన్స్ ఉంటాయి, చిరాకులు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి బుద్దిడి విగ్రహం లాగా ఆయన చాలా ఓపిక‌గా ఉంటారు. అందు వల్లే 4 సంవత్సరాలైన ఓపికగా ‘బాహుబలి' సినిమా చేశారు... అని ప్రభాస్ శ్రీను తెలిపారు.

 ప్రభాస్‌కు నాన్నతో చాలా అనుబంధం

ప్రభాస్‌కు నాన్నతో చాలా అనుబంధం

ప్రభాస్‌కు వాళ్ల నాన్నతో చాలా అనుబంధం. డాడీ అంటే చాలా ఇష్టం. పెద్దాయన పోయిన తర్వాత చాలా బాధపడ్డారు కానీ బయటపడరు. పెద్దాయన ఉన్నపుడు కుటుంబం మొత్తం కలిసి ఉండేలా ఒక కల్చర్ అలవాటు చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతుంది. దీపావళి పండగ సమయంలో అయితే వారింట్లో చాలా సందడి ఉంటుంది అని ప్రభాస్ శ్రీను తెలిపారు.

 ముద్దు సీన్ కోసం నాన్నను అడిగాడు

ముద్దు సీన్ కోసం నాన్నను అడిగాడు

ప్రభాస్ వాళ్ల నాన్నతో ఎంత క్లోజ్‌గా ఉంటారంటే..... ఓ సారి అడవిరాముడు సినిమా సమయంలో ముద్దు సీన్ చేయాల్సి వచ్చింది. అపుడు ప్రభాస్ వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి నాన్న ఇక్కడ ముద్దు సీన్ చేయమంటున్నారు, నేను చేయవచ్చా? అని అడిగారు. అందుకు పెద్దాయన.... సినిమానే కదా చేయొచ్చు అని అంటూ రిప్లై ఇచ్చారు. వాళ్లిద్దరూ అంత క్లోజ్‌గా ఉంటారు.... అని ప్రభాస్ శ్రీను తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X