Kalki 2898 AD: ప్రాజెక్టు K టైటిల్ ఇదే.. హాలీవుడ్‌ను తలదన్నేలా గ్లింప్స్.. ప్రభాస్ నువ్వు తోపు సామీ!

తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయింది. అందుకే మన ఇండస్ట్రీలో కొంత కాలంగా అతి భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో ఎక్కువగా ప్రభాస్ నుంచే హై రేంజ్ చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు అతడు నటిస్తోన్న మరో సినిమానే 'Project K'. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక, తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

హాలీవుడ్ రేంజ్‌లో ప్రాజెక్టు K:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రమే 'Project K'. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

టైం ట్రావెల్... కోట్ల బడ్జెట్‌తో:'Project K' మూవీని టైం ట్రావెల్ స్టోరీతో నడుస్తుందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అంతేకాదు, ఇందులో టైం మెషీన్ యుగాలనే దాటి వెళ్లిపోతుందట. అంటే గతానికి, భవిష్యత్‌కు ముడి పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు రూ. 600 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా హై రేంజ్ టెక్నికల్ వ్యాల్యూస్‌తో దీన్ని తీస్తున్నారు.

కామిక్ కాన్ ఈవెంట్‌లో రచ్చ:స్టార్ హీరో ప్రభాస్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాకు Project K అనే పేరును పెట్టింది. దీంతో ఇదే ఫైనల్ అని అంతా అనుకున్నారు. కానీ, ఈ పేరు కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక, ఇందులో K అంటే ఏంటి అనే దానిపై అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చేశారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie Glimpse Released

ప్రాజెక్టు K..కల్కి 2898 ఏడీ:అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న Project K మూవీ అసలు టైటిల్‌ను అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో రివీల్ చేశారు. దీనికి 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అంటే ఈ సినిమా క్రీస్తు శకం 2898లో జరిగే కథతో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి.

Prabhas Starrer Kalki 2898 AD Movie Glimpse Released

గ్లింప్స్‌లో ఏముంది అంటే:Kalki 2898 AD మూవీ టైటిల్‌కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రత్యర్థుల చేతిలో మనుషులు బంధీలుగా ఉండి కష్టాలను ఎదుర్కొంటుంటారు. అప్పుడు వాళ్లను కాపాడేందుకు సూపర్‌ హీరో వస్తాడు. అతడు ప్రత్యర్థులను అంతం చేసి తమ వారిని రక్షించేందుకు పోరాడడాన్ని గ్లింప్స్ వీడియోలో చూపించారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie Glimpse Released

హాలీవుడ్‌ను తలదన్నేలానే:తాజాగా విడుదలైన ప్రభాస్ Kalki 2898 AD గ్లింప్స్ హాలీవుడ్‌ను తలదన్నేలానే డిజైన్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో చూపించిన విజువల్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సంతోష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా యుద్దానికి సంబంధించిన సీన్స్ మాత్రం హైలైట్‌గా ఉన్నాయి. దీంతో ఈ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X