Salaar Release Date: డైనోసార్ వచ్చేది ఆరోజే.. ప్రభాస్ వైల్డ్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎంతో మంది బడా హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అంతలా అతడు ఈ మధ్య కాలంలో అతి భారీ చిత్రాలను చేస్తూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకెళ్తోన్నాడు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా చిత్రాలను చేస్తున్నాడు. అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురు చూసేది మాత్రం 'సలార్ - సీజ్‌ఫైర్' మూవీనే. దీనికి కారణం ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండడమే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే ఉన్నారు.

నిజానికి 'సలార్' మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, ఉన్నట్లుండి ఈ సినిమా బుకింగ్స్ ఆగిపోవడంతో ఇది వాయిదా పడుతుందన్న టాక్ మొదలైంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని పోస్ట్ పోన్ చేసేశారు.
'సలార్' మూవీ వాయిదా కన్ఫార్మ్ అయిన తర్వాత దీని కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఈ ఊహాగానాలు మరింతగా పెరిగిపోతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'సలార్' టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేసింది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీ మొదటి భాగాన్ని ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇందుకోసం ఒంటి నిండా రక్తంతో కూడిన ప్రభాస్ వైల్డ్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో అతడి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇదిలా ఉండగా.. 'సలార్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతున్న సంగతి విధితమే.


Click it and Unblock the Notifications











