మూడో దశ గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రభాస్
ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం అందరూ ప్రకృతి ప్రకోపానికి గురైనవారే. అడవుల సంరక్షణ, చెట్లను పెంచే కార్యక్రమాలను ప్రభుత్వాలు నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమం ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ రేంజ్‌లో పాపులర్ అయిందో అందరికీ తెలిసింది.
ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు దశలను పూర్తి చేసుకుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా.. సినీ సెలెబ్రిటీలందరూ తలా ఓ మొక్కను నాటారు. ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ గ్రీన్ ఇండియాగా మార్చేందుకు తోడ్పడ్డారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రోజా వనం అని నటి, ఎమ్మెల్యే రోజా కూడా తన మిత్రులు, తోటి నటీమణులతో మొక్కలను నాటించింది. తాజాగా గ్రీన్ ఇండియాలో మూడో దశను ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు.

ఈ మేరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూడో దశ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన స్వగృహంలో మొక్కలు నాటాడు. అందులో భాగంగా సంతోష్ కుమార్‌తో సెల్పీ దిగి తన మొక్కలను అభిమానులకు చూపించాడు. మరి ఈ దశలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంత వరకు వ్యాప్తి చెందుతుందో చూడాలి. ఎవరెవరు సవాళ్లు విసురుకుంటారో ఎవరెరవరు మొక్కలు నాటుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











