అనుష్కతో ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభాస్ స్ట్రాంగ్ రిప్లై
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - అనుష్క కలిసి మూడు సినిమాల్లో నటించారు. అందులో 'బాహుబలి' కోసమే దాదాపు ఐదేళ్లు కలిసి ట్రావెల్ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరూ తమ మధ్య ప్రేమ లేదని ఎన్ని సార్లు సమాధానం చెప్పినా పుల్‌స్టాప్ మాత్రం పడడం లేదు. తాజాగా ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ప్రభాస్ కొంచెం ఘాటుగానే స్పందించాడు. వివరాల్లోకి వెళితే...

‘సాహో' ప్రమోషన్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన కొత్త సినిమా ‘సాహో' ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల చిత్ర కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని ఇంటర్వ్యలతో వస్తున్నాడు. హీరోయిన్ శ్రద్దాతో కలిసి ఫేమస్ యాంకర్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

అనుష్క గురించే ప్రశ్నలు
ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా అనుష్క గురించే ప్రశ్నిస్తున్నారు. ‘మీర.. అనుష్క డేటింగ్ చేస్తున్నారంట కదా' అని ఒకరంటే.. ‘ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంట కదా' అని మరొకరు అంటున్నారు. అంతేకాదు, గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న అంశాలు అని ‘అనుష్క - ప్రభాస్ మ్యారేజ్' అని కూడా ప్రస్తావిస్తున్నారు.

ప్రభాస్ ఘాటు రిప్లై
ఇప్పటికే చాలా సార్లు అనుష్కతో ఉన్న బంధం గురించి చెప్పిన ప్రభాస్.. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించాడు. ‘ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. అన్ని సార్లూ నేను సమాధానం చెప్పాను. మళ్లీ చెబుతున్నాను.. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? అంతెందుకు అనుష్కను కలిసి రెండేళ్లు అయిపోయింది' అని చెప్పుకొచ్చాడు.

అనుష్క కూడా చెప్పింది
ప్రభాస్ మాత్రమే కాదు.. అనుష్క కూడా గతంలో చాలా సార్లు ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమాయణం జరగడం లేదని వెల్లడించింది. ఇక, ఈ కారణంగానే ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటోందని కూడా వార్తలు వచ్చాయి.

సాహో గురించి
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో'. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. అలాగే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











