ట్రెండ్ మార్చిన రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ తో...!
మాస్, డాన్, కాంచన లాంటి హిట్ చిత్రాలను తీసిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రెబల్'. జె భగవాన్, జె పుల్లా రావు ఈ రెబల్ చిత్రానికి నిర్మాతలు. ప్రభాస్ సరన తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబందించిన చివరి షెడ్యూల్ ని నవంబర్ 5 నుంచి ఏకదాటిగా జరగనుంది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ఈ రెబల్ చిత్రం ప్రభాస్ కెరియర్ లో ఒక మంచి చిత్రం గా నిలిచిపోతుందని, ఈ క్యారక్టర్ ని ప్రభాస్ తప్ప మరెవరూ చేయలేరని అన్నారు. రెబల్ చిత్రం అన్ని విధాలా ఒక మంచి చిత్రం గా నిలుస్తుందని తెలియజేశారు.
వరుస విజయాలతో మంచి ఎనర్జీతో వున్న ప్రభాస్ ఇప్పుడు వైవిధ్యమైన సినిమాల కోసం పరితపిస్తున్నాడు. తనను కొత్తగా ప్రజెంట్ చేయగల దర్శకులను ఎంచుకుంటూ కెరీర్‌ను వేగవంతంగా కొనసాగిస్తున్నాడు ఈ యువ కథానాయకుడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ విజయాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్ త్వరలో ఓ స్టయిలిష్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్ ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో నటిస్తున్న 'రెబల్" చిత్రంతో పాటు రచయిత కొరటాల శివ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. ఆ చిత్రం కోసమే ప్రభాస్ ఇలా కొత్తగా కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











