ప్రభాస్ రొమాన్స్ తో కిక్ కొడతాడా!
'ఛత్రపతి" తర్వాత మళ్ళీ మరో విజయాన్ని రుచి చూడాలని ప్రభాస్ తహతహాలాడిపోతున్నా అతని సినిమాలన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా పల్టీ కొట్టేస్తున్నాయి. మాస్ సినిమాల నుంచి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ వైపు మారినా అంతగా ఫలితం లేకపోవడంతో ప్రభాస్ ఇపుడు మరో రూటు వెతుక్కుంటున్నాడు. రొమాంటిక్ హీరోగా తనని తాను మలచు కునేందుకు సాప్ట్ సినిమాల డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రస్తుతం కరుణాకరన్ తో 'డార్లింగ్" చేస్తోన్న ప్రభాస్ ఈ తర్వాత దిల్ రాజు బ్యానర్లో 'సంతోషం" సినిమా దశరథ్ దర్శకత్వంలో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించనున్నాడు. ఈ నెలఖరుకి ప్రారంభమయ్యే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సారా జైన్, తపసి అనే ఇద్దరు కొత్త హీరోయిన్లు నటిస్తారు. రొమాన్స్ తో అయినా రెబల్ స్టార్ స్టార్ తిరుగుతుందేమో చూడాలి.
More from Filmibeat
ప్రభాస్ ఛత్రపతి శ్రియ కరుణాకర్ డార్లింగ్ దిల్ రాజు సంతోషం దశరథ్ సారా జైన్ తపసి prabhas chatrapati shriya karunakar darling dil raju santosham dasharadh sara jain tapasi


Click it and Unblock the Notifications











