హీరో ప్రభాస్ చెప్పిన సమాధానంతో అంతా షాక్?
Recommended Video

బాహుబలి స్టార్ ప్రభాస్ తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. 'సాహో' తర్వాత ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు యంగ్ రెబల్ స్టార్ ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు. . ''సాహో తర్వాత ఏం చేస్తానో నాకే క్లారిటీ లేదు. సినిమాలు చేస్తానో, వ్యాపారం చేస్తానో లేక వ్యవసాయం చేస్తానో తెలియదు. వ్యాపారం, వ్యవసాయం రెండూ చేస్తానేమో చెప్పలేను..'' అంటూ ప్రభాస్ చెప్పిన సమాధానంతో అంతా షాకయ్యారు.

అప్పుడే సినిమాలంటే బోర్ కొట్టిందా..?
ప్రభాస్ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. బాహుబలి తర్వాత జాతీయ స్థాయి హీరోగా అవతరించిన ప్రభాస్ నుండి ఇలాంటి మాట వస్తుందని ఎవరూ హించలేదు. బాహుబలి సినిమాకు ఏళ్లతరబడి కష్టపడటం, ఇపుడు సాహో మూవీ కూడా పూర్తి కావడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకుంటుండటంతో విరక్తితో బహుషా ఆయన ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు.

సినిమాలు వదిలేస్తానని చెప్పలేదంటున్న ఫ్యాన్స్
అయితే ప్రభాస్ అలా చేయకపోవచ్చు, ఏదో సరదాగా ఆ కామెంట్స్ చేసి ఉంటారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. సినిమాలను వదిలేస్తానని ప్రభాస్ చెప్పలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభాస్‌కు సినిమాలంటే పిచ్చి అని, అంత ఇష్టం ఉంది కాబట్టే బాహుబలి కోసం 5 ఏళ్లు కష్టపడ్డాడని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

సాహో తర్వాత లైన్లో ఉన్న ప్రాజెక్టులు
వాస్తవానికి ప్రభాస్ కమిటైన ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ‘జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స నిర్మాణంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో పాటు తన పెద్దనాన్న కృష్ణం రాజుతో కూడా సినిమా చేయాల్సి ఉంది.

సాహో...
సుజీత్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సాహో మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రమిది. హిందీ, తమిళం, తెలుగులో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











