తిరుగుబాటు చేస్తున్న ప్రభాస్
జరుగుబాటు లేక తిరుగుబాటు చేస్తూంటారు చాలామంది. అయితే ప్రస్తుతం దేనిమీద తిరుగుబాటు చేస్తున్నాడో కానీ తిరగబడి పోరాడుతున్నాడు. అయితే అది కేవలం రెబెల్ చిత్రం కోసం.ప్రభాస్ తన తాజా చిత్రం 'రెబల్' కాన్సెప్టు గురించి మాట్లాడుతూ..ఒక్కడు ఎదురు తిరిగితే తిరుగుబాటు...అదే వంద మందైతే పోరాటం. చరిత్రలో నిలిచిపోయిన ఏ పోరాటంలో అయినా వెనుక ఉన్న వంద మంది గురించి చెప్పుకోలేదు. ముందుండి నడిపించిన ఒక్కడి గురించే మాట్లాడుకొన్నారు. ఆ ఒక్కడే రెబెల్. అతని పోరాటం ఎవరి మీదో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాడు.
ప్రభాస్ సరసన అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని లారెన్స్ డైరక్ట్ చేస్తున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.త్వరలో బ్యాంకాక్‌లో ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నామన్నారు. డిసెంబరులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఎ.ఎస్.ప్రకాష్.


Click it and Unblock the Notifications











