అనుష్కతో డేటింగ్ గురించి ప్రభాస్.. రాజమౌళినే అడగండి.. అందుకు సాక్ష్యం ఆయనే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్రేజీ హీరో. దేశవ్యాప్తంగా ప్రభాస్ చిత్రాల కోసం అభిమానులు ఎందురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం ప్రభాస్ కు అంతలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో దూసుకుపోతోంది. ప్రముఖ సెలెబ్రిటీలతో కరణ్ జోహార్ నిర్వహిస్తున్న చిట్ చాట్ కార్యక్రమానికి మంచి క్రేజ్ వచ్చింది. కరణ్ జోహార్ తొలిసారి సౌత్ సెలెబ్రిటీలతో ఈ షో నిర్వహించారు. బాహుబలి త్రయం రాజమౌళి, ప్రభాస్ రానా ఈ షోలో పాల్గొన్నారు.

చాలా రోజులుగా
అభిమానులు చాలా రోజులుగా ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేశారు. ప్రభాస్, రానా, రాజమౌళి నుంచి కరణ్ జోహార్ అనేక ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఈ షోలో ప్రభాస్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ గురించి కూడా ప్రస్తావించాడు.

రెండేళ్లు కలసి పనిచేస్తే చాలు
అనుష్కతో డేటింగ్ అంటూ వస్తున్న రూమర్స్ గురించి కరణ్ జోహార్ ప్రభాస్ ని ప్రశ్నించాడు. అలాంటిది ఏమీ లేదని.. ఆవార్తల్లో వాస్తవం లేదని ప్రభాస్ బదులిచ్చాడు. ఏ ఇద్దరు నటులైనా రెండేళ్లకు పైగా కలసి పనిచేస్తే సహజంగానే వారిద్దరి మధ్య లింక్ ఉన్నట్లు ప్రచారం చేస్తారని ప్రభాస్ తెలిపాడు. కానీ మా ఇద్దరి మధ్య లాంటిది లేదు. కావాలంటే రాజమౌళిని అడగండి అని ప్రభాస్ తెలిపాడు. రానా కలగజేసుకుని ప్రభాస్, అనుష్క డేటింగ్ లో లేరని తెలిపాడు.

భార్యగా, తల్లిగా
ప్రభాస్ వివరణపై కరణ్ జోహార్ సరదాగా స్పందించారు. అనుష్క నీకు బాహుబలిలో భార్యగా, తల్లిగా రెండు పాత్రల్లో నటించింది. ఇది కొంచెం కష్టమే అని కరణ్ జోహార్ తెలిపాడు. ప్రభాస్ స్పందిస్తూ.. అవును.. అలాంటప్పుడు ఆమెతో డేటింగ్ ఎలా చేస్తాను అని ప్రభాస్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ప్రభాస్, అనుష్క వివాహానికి సిద్ధం అవుతున్నారు అంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి.
అనుష్క చాలా సెక్సీ
ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా ప్రభాస్ కరణ్ జోహార్ కు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ లో సెక్సియెస్ట్ నటి ఎవరు అని ప్రశ్నించగా.. అనుష్క అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. అనుష్క, కాజల్, తమన్నా.. ఈ ముగ్గురిలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకుంటావు అని ప్రశ్నించగా.. అనుష్క అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. ఇందులో ఎలాంటి రూమర్ లేదు.. ఆమె నాకు చాలా ఏళ్లుగా స్నేహితురాలు, నటిగా కూడా అనుష్క బెస్ట్. నాకే కాదు రాజమౌళికి కూడా అనుష్కనే ఫేవరేట్ నటి అని ప్రభాస్ తెలిపాడు.

ప్రభాస్‌కు బాగా నచ్చిన హీరో
టాలీవుడ్ ఉత్తమ నటుడిగా వీరిలో ఎవరిని భావిస్తావు అని మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ పేర్లు కరణ్ జోహార్ తెలిపాడు. తాను మొదటి స్థానం ఎన్టీఆర్ కు ఇస్తానని ప్రభాస్ తెలిపాడు. ఆ తర్వాత మహేష్, బన్నీ, చరణ్ అని ప్రభాస్ తెలిపాడు. అలియా భట్, దీపికాలో ఉత్తమ నటి అలియా అని ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్ కాఫీ విత్ కరణ్ షో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











