ప్రభాస్‌తో కోట్లల్లో డీల్.. ఆ ఒక్క వీడియో ఎఫెక్ట్!
Recommended Video

డార్లింగ్ ప్రభాస్ జాతీయవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిపోయాడు. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ శిఖరానికి ఎదిగింది. ప్రభాస్ నటించే సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువత ఎదురుచూస్తున్నారు. ఆరడుగుల కటౌట్, ముగ్దమనోహర రూపంతో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ యువతులు హృదయాల్లో కొలువైపోయాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ సుజీత్ దర్శత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహి చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. బడా కంపెనీలు కూడా ప్రభాస్ క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

సూపర్ స్టైలిష్‌గా
ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో చిత్ర యూనిట్ షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్నాడు. వీడియో చివర్లో ప్రభాస్ స్టైలిష్ ఎంట్రీ, ఆ తరువాత బైక్ పై మెరుపు వేగంతో దూసుకుని వెళ్లడం అభిమానులకు కనువిందు కలిగించింది.

కోట్లు కుమ్మరించడానికి రెడీ
బడా కార్పొరేట్ సంస్థలు ప్రభాస్ కోసం కోట్లు కుమ్మరించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీల ఓ ప్రముఖ మోటార్ బైక్ సంస్థ ప్రభాస్ ని కలసి తమ సంస్థకు బ్రాండింగ్ చేయాలని కోరిందట. దీనికోసం ప్రభాస్ కు కోట్లల్లో కళ్ళు చెదిరే అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఎండార్స్ మెంట్ వైపు ఆసక్తిగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీడియో ఎఫెక్ట్
షేడ్స్ ఆఫ్ సాహోలో ప్రభాస్ బైక్ పై దూసుకెళుతున్న లుక్ చూసి కంపెనీలకు ఆలోచన తట్టినట్లు ఉంది. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రభాస్ తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తే తిరుగులేని ఆదాయాలు పొందవచ్చేంది కార్పొరేట్ సంస్థల ఆలోచన. ప్రభాస్ తాజా డీల్ కు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరో చిత్రం
సాహో చిత్రంతో పాటు ప్రభాస్ మరో చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ సుజిత్ దర్శత్వంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రం 1960, 70 కాలానికి చెందిన కథ అనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇటలీలో ఈ చిత్ర తొలి షెడ్యూల్ నిర్వహించారు.


Click it and Unblock the Notifications











