Adipurush థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు.. సరికొత్త వివాదంపై ఘాటుగా ప్రభాస్ టీమ్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా తిరుపతిలో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాను వివాదాలు వేగంగా చుట్టుముడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఆదిపురుష్‌ను టార్గెట్‌గా చేసుకొని చేసిన పోస్టులు అత్యంత వివాదానికి దారి తీశాయి. అయితే ఈ సినిమాపై వస్తున్న రూమర్లు, అసత్య ప్రచారాలను ఆదిపురుష్ టీమ్, యూవీ క్రియేషన్ స్పందించింది. ఈ సినిమా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి పట్టణంలోని యూనివర్సిటీ గ్రౌండ్‌లో వైభవంగా జరిగింది. నభూతో నభవిష్యత్ అనే విధంగా జరిగిన ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు. గ్రౌండ్ కిక్కిరిసి పోవడంతోపాటు గ్రౌండ్‌లో ఉన్న జనం కంటే రెండింతలు రోడ్లపై ఉండటం విశేషంగా మారింది. ప్రభాస్, ఆదిపురుష్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఈవెంట్ ఎంతో చెప్పింది.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిందనే జోష్‌లో ఉన్న ఆదిపురుష్ టీమ్‌కు ఓం రావత్, కృతిసనన్ ముద్దు సంఘటన వివాదంలో నెట్టింది. తిరుమల మాడ వీధుల్లో వీరిద్దరూ ముద్దు పెట్టుకోవడంపై భక్తులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఓం రావత్, కృతిసనన్ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఓ వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు అంటూ ఓ పోస్టు వైరల్ అయింది.
ఆదిపురుష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీగా హిందూ ధర్మం కోసం నిర్మించాం. కాబట్టి హిందువులందరూ ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలి అంటూ సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్టు వైరల్ అయింది. అయితే ఈ సినిమాపై కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆదిపురుష్ టీమ్ ఖండన చేసింది.
ఆదిపురుష్ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. అసత్య ప్రచారం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటున్నాయి. సమానత్వం అనే విషయాన్ని ఆదిపురుష్ టీమ్ గౌరవిస్తుంది. వివక్ష, కులం, మతం, వర్ణాలను పట్టించుకోం. ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. వీటిని ఖండించండి. ఇలాంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి అని ఆదిపురుస్ టీమ్ ప్రకటన చేసింది.


Click it and Unblock the Notifications











