నాన్ బాహుబలి రికార్డ్స్ అంటున్నారు, ప్రభాస్ అభినందనలు!
''బాహుబలి 2'' సినిమా విడుదలై నేటితో ఏడాది అవుతోంది. ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి2'. అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ లో విడుదల అయ్యింది.
Recommended Video


బాహుబలి 2 కు ఏడాది
ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి2'. అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ 28 లో విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ప్రభాస్ తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ లో తెలియజేసాడు.

ప్రభాస్ ధన్యవాదాలు చెప్పారు
''బాహుబలి 2'' సినిమా విడుదలై నేటితో ఏడాది అవుతోంది. ఈ రోజు మర్చిపోలేను. నా అభిమానులకు, నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసాడు. అలాగే ఈ చిత్ర యూనిట్ కు అభినదనలు, రాజమౌళి ని ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చెయ్యడం జరిగింది.

బాహుబలి రికార్డ్స్
రాజమౌళి రూపొందించిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా గత ఏడాది ఈరోజు విడుదల అయ్యింది. ప్రేక్షక లోకాన్ని విశేషంగా అలరించిన బాహుబలి ది కంక్లూజన్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. పలు భాషలలో విడుదలైన ఈ చిత్రం 1700 కోట్లకి పైగా వసూళ్ళు చెయ్యడం విశేషం. ఇప్పటివరుకు ఈ సినిమా రికార్డ్స్ ఏసినిమా బ్రేక్ చెయ్యలేకపోయింది. సినిమా రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ సంభోంచడం విశేషం.

బాహుబలి 2 లేటెస్ట్ టెక్నాలజీతో
ప్రభాస్, అనుష్క,రానా, తమన్నా, రమ్యకృష్ణ,సత్యరాజ్,నాజర్ తదితర పాత్రలలో రూపొందిన బాహుబలి 2 చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించాడు. ఈ సినిమా కోసం లేటెస్ట్ టెక్నాలజీని వాడటం జరిగింది.


Click it and Unblock the Notifications











