హ్యాపీ వెడ్డింగ్‌కు ప్రభాస్ ఓకే.. యంగ్ రెబల్ స్టార్ ట్వీట్!
మెగా డాటర్ నిహారిక, హీరో సుమంత్ అశ్విన్‌తో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా రూపొందిస్తున్న చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్రానికి దర్శకుడు లక్ష్మన్ కార్య. ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, ఫిదా ఫేం శక్తి కాంత్ కార్తీక్ మ్యూజిక్ అందించారు. ఎం సుమంత్ రాజు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురించి ప్రభాస్ ట్వీట్ చేశారు.

హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్. సుమంత్ అశ్విన్, లక్ష్మణ్, నిహారిక, నా స్నేహితులు వంశీ, ప్రమోద్‌కు గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. అందుకు సమాధానంగా థ్యాంక్యూ డార్లింగ్ అంటూ యువీ క్రియేషన్ నిర్వాహకులు రీట్వీట్ చేశారు.
సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్ర ట్రైలర్‌ను జూన్ 29న రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ సీన్లతో ట్రైలర్ ఆకట్టుకొంటున్నది.
happy wedding niharika konidela sumanth ashwin prabhas uv creations హ్యాపీ వెడ్డింగ్ నిహారిక కొణిదెల సుమంత్ అశ్విన్ ప్రభాస్


Click it and Unblock the Notifications