మహేష్‌ను అధిగమించిన ప్రభాస్: టాప్ 2 ర్యాంక్, ఇతర హీరోల స్థానం...
Recommended Video

ప్రఖ్యాత టైమ్స్ సంస్థ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017 టాప్ 50 సెలబ్రిటీల జాబితా విడుదల చేసంది. ఆన్‌లైన్ పోల్ సర్వే ద్వారా ఆయా స్టార్లకు ర్యాంకులు కేటాయించారు. తెలుగు నుండి కేవలం నలుగురు స్టార్స్ మాత్రమే టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నారు. నెం.1 స్థానాన్ని బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ దక్కించుకోగా... ప్రభాస్, మహేష్ బాబు, రానా టాప్ 10లో తమ స్థానం పదిలిపరచుకున్నారు. 2016 ర్యాంకులతో పోలిస్తే 2017లో చాలా మంది స్టార్స్ ర్యాంకులు తారు మారయ్యాయి.

నెం. 1 స్థానంలో రణ్‌వీర్
2016లో 4వ స్థానంలో ఉన్న రణవీర్‌సింగ్ ఈ సారి అందరినీ వెనక్కి నెట్టి నెం.1 స్థానం దక్కించుకున్నాడు.

నెం.2 స్థానంలో ప్రభాస్
అంతకు ముందు ఏడాది 22వ స్థానంలో ఉన్న ప్రభాస్ 2017లో విడుదలైన బాహుబలి-2 ఎఫెక్టుతో నెం.2 స్థానికి ఎగబాకాడు. మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా మారిపోయాడు.

విరాట్ కోహ్లి
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి ఈ సారి జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. అంతకు ముందు ఈ యంగ్ క్రికెటర్ 2వ స్థానంలో ఉండగా.... ఈ సారి ఒక ర్యాంక్ తగ్గాడు.

హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మున్ జాబితాలో హృతిక్ రోషన్ ఒక స్థానం దిగజారి 4వ స్థానంలో నిలవగా, మరో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఒక స్థానం ఎగబాకి 5వ స్థానంలో నిలిచాడు.

మహేష్ బాబు...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 6వ స్థానంలో నిలిచాడు. అంతకు ముందు ఏడాది మహేష్ బాబు 7వ స్థానంలో ఉండగా.... ఈ సారి ఒక లెవల్ పెరిగారు.

రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి 24 స్థానం నుండి ఏకంగా 7వ స్థానంలోకి వచ్చారు. రానా ర్యాంకు పెరగడానికి కూడా బాహుబలి 2, ఘాజీ చిత్రాలు కారణమని చెప్పొచ్చు. రానా తర్వాత టాప్ 10లో దుల్కర్ సల్మాన్ (9) ఉన్నారు. మరో తెలుగు హీరో హర్ష వర్దన్ 35వ స్థానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











