Prabhas20 ఫస్ట్‌లుక్.. టైటిల్ అనౌన్స్‌మెంట్ కన్ఫర్మ్.. డేట్లు ఇవేనంటూ.. టాప్ ట్రెండింగ్

బాహుబలి, సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, సింగిల్ వార్త దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. కేవలం టైటిల్, ఫస్ట్ లుక్‌ వార్తకే అభిమానులు రెచ్చిపోయి ట్వీట్ల సునామీ సృష్టిస్తున్నారు. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ఏమిటనే ప్రశ్న అందర్ని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుండంటే..

Recommended Video

#Prabhas20Firstlook : Prabhas 20 Title Might Be Annouce This June!
ప్రభాస్20 గురించి క్రేజీ వార్తలు

ప్రభాస్20 గురించి క్రేజీ వార్తలు

ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నింపుతున్నాయి. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం కూడా నటిస్తున్నారనే వార్త క్రేజీగా మారింది. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురం సినిమాలో జయరాం కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో ఆశ్చర్యానికి గురిచే విధంగా నటీనటుల ఎంపిక జరిగిందనే ప్రచారం జరుగుతున్నది.

పరిశీలనలో టైటిల్

పరిశీలనలో టైటిల్

ప్రభాస్ నటిస్తున్న తన 20 చిత్రానికి సంబంధించిన సినిమాకు మొదట జాను అనే టైటిల్‌ను పరిశీలించారు. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోరిక మేరకు ఆ టైటిల్‌ను శర్వానంద్, సమంత నటించిన చిత్రానికి జాను అనే టైటిల్‌ను పెట్టుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో తాజాగా వారు టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రభాస్ 20 మూవీపై సునామీల ట్వీట్లు

ప్రభాస్ 20 మూవీపై సునామీల ట్వీట్లు

ప్రభాస్‌20కి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ అనౌన్స్ చేయవచ్చనే ఊహాగానాలతో కూడిన వార్త బయటకు రావడం, అది ట్విట్టర్‌లో 10 వేలకుపైగా ట్వీట్లతో నేషనల్ ట్రెండింగ్‌గా మారింది. ప్రభాస్ మూవీకి సంబంధించిన టైటిల్ ప్రకటన తేదీలు ఒక్రట్రెండు రోజుల్లో ప్రభాస్ స్వయంగా వెల్లడిస్తారనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. తన 20వ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో అనే విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించనున్నారు.

జూన్ రెండు లేదా మూడు వారాల్లో

జూన్ రెండు లేదా మూడు వారాల్లో

రెబల్‌స్టార్ అభిమానులకు ప్రభాస్ మంచి బహుమతిని అందించబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా యంగ్ రెబల్ స్టార్ #prabhas20Firstlook ప్రకటన చేయబోతున్నారు. బహుశా జూన్ రెండోవారంలో గానీ, మూడో వారంలో గానీ ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయడం జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఒకటి కాదు.. రెండు శుభవార్తలు

ఒకటి కాదు.. రెండు శుభవార్తలు

అయితే ప్రభాస్ తన అభిమానులకు రెండు రకాల శుభవార్తలు అందించనున్నారనే వార్త ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రకటనతోపాటు, హీరోయిన్‌తో ఓ పాటను కూడా రెండో అనౌన్స్‌మెంట్‌గా రాబోతున్నదనే వార్త వినిపిస్తున్నది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్‌కు దగ్గరపడాల్సింది. కరోనావైరస్ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో విడుదల ఆలస్యమైంది. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను వేసి సన్నివేశాలను షూట్ చేయానికి సిద్దమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X