ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే.. అమ్మాయి కూడా ఫిక్స్.. ఎవరంటే?
టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరయా? అని అడిగితే ముందుగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు పెళ్లి గురించి పట్టించుకునేంత తీరిక లేకుండా పోయింది అనే విషయం అందరికీ తెలుసు. చివరిగా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. అయితే ఆయన పెళ్లి గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా ఇప్పుడు మరోసారి ఆయన పెళ్లి వార్త తెర మీదకు వచ్చింది. ఆయన పెళ్లి ఈ ఏడాదే అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఈశ్వర్ సినిమాతో
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ప్రభాస్. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అంటే బిరుదు కూడా అందుకున్నాడు. ఇక సినిమాల ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ రెబల్ స్టార్ అభిమానులందరికీ ఏదైనా కోరిక ఉందంటే అది ఆయన పెళ్లి.

త్వరలో పెళ్లి అంటూ
ప్రభాస్ కు నలభై ఏళ్ళు పైబడడంతో ఇక తమ హీరో పెళ్లి చేసుకుంటే చూడాలని వారు ఎదురుచూస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎన్నో రూమర్లు కూడా పుట్టుకొచ్చినా ఒక్క రూమర్ కూడా నిజం కాలేదు. మొన్నామధ్య కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లెప్పుడంటే ప్రభాస్ చేసుకున్నప్పుడంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయన భార్య శ్యామల మాత్రం త్వరలో పెళ్లి అంటూ ఊదర కొడుతున్నారు.

పెళ్లి చేసుకోబోతున్నట్లు
అయితే మొన్నీమధ్య మరో ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన కృష్ణంరాజు మరియు ప్రభాస్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ప్రభాస్ ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.

శుభవార్త వినడానికి
పెళ్లికుమార్తె కూడా ప్రభాస్ కోసం లాక్ అయిందని, కృష్ణంరాజు కుటుంబం తగిన సమయంలో వివరాలను వెల్లడిస్తుందని ఆ వ్యక్తి వెల్లడించారు. ఇక ఈ చిన్న వీడియో బైట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు త్వరలో, ప్రభాస్ నుండి శుభవార్త వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బిజీ బిజీగా
ప్రభాస్ కు త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేయాలని ఆయన కుటుంబం నిర్ణయించిందని, అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి నిశ్చయం కానుందని ఒక టాక్ నడుస్తోంది. ఈ విషయం మీద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అదే నిజమని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి.
బిజీ బిజీగా
ప్రభాస్ కు త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేయాలని ఆయన కుటుంబం నిర్ణయించిందని, అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి నిశ్చయం కానుందని ఒక టాక్ నడుస్తోంది. ఈ విషయం మీద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అదే నిజమని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











