డార్లింగ్‌తో కేరళ కుట్టి... ప్రభాస్ 21 ఇక కన్నుల పండగే మరి
మహానటితో జాతీయ మీడియాను తనవైపుకు తిప్పుకున్న నాగ్ అశ్విన్ తదుపరి ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే జోడీ కట్టబోతుండటంతో ట్రేడ్ వర్గాల్లోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో సినిమాలోకి మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎంట్రీ ఇస్తుండటంతో మరింత ఆసక్తి రేకెత్తుతోంది.
చలాకీగా కనిపిస్తూ, ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ, అభినయంతోనూ మెప్పిస్తున్న నివేథా థామస్, క్రమంగా కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతోంది. తాజాగా ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలోనూ అమ్మడు ఓ కీలకమైన పాత్ర పోషించబోతోందట. ఈ పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ప్రభాస్ 21, మల్టీలింగువల్ అన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా పేరుగాంచిన ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే, ప్రభాస్, నాగ్ అశ్విన్ క్యారెక్టర్ డైలాగ్ మాడ్యులేషన్ కు సంబంధించిన పనులు మొదలుపెట్టేశారు. మరి భారీ అసెట్స్ తో ఊరిస్తున్న ప్రభాస్ 21 ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











