twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు హాలీవుడ్ చిత్రాల తరహాలో.. పిచ్చెక్కించబోతున్న ప్రభాస్, సాహో యాక్షన్ సీన్స్!

    |

    బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సాహో యాక్షన్ సీన్స్‌పై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ లో సూపర్ హిట్ రెండు చిత్రాల ఆధారంగా సాహో యాక్షన్ సీన్స్ రూపొందించినట్లు తెలుస్తోంది.

    కనీవినీ ఎరుగని విధంగా

    కనీవినీ ఎరుగని విధంగా

    దర్శకుడు సుజిత్ ఈ చిత్రంలో ప్రభాస్ ని స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నాడు. సాహో చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి యాక్షన్ సీన్స్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలని ప్రధాన ఆకర్షణగా చిత్రీకరిస్తున్నారు. దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్, చేజింగ్ సన్నివేశాలు ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతునట్లు తెలుస్తోంది.

    ఆ రెండు హాలీవుడ్ చిత్రాలు

    ఆ రెండు హాలీవుడ్ చిత్రాలు

    సాహో చిత్రంపై రెండు హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఉనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సినీ ప్రియులని టెర్మినేటర్, జడ్జిమెంట్ డే లాంటి చిత్రలో ఎంతగానో అలరించాయి. ఆ రెండు చిత్రాల తరహాలో సాహో యాక్షన్ ఎపిసోడ్స్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ ప్రభాస్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కొండల్లో, నదుల్లో

    కొండల్లో, నదుల్లో

    ప్రభాస్ ఈ చిత్రంలో కొండలు ఎక్కడం, నదులు దాటడం, బైక్ చేజింగ్ లాంటి సన్నివేశాల్లో ఆదరగోట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా సాహో చిత్ర షూటింగ్ జరుగుతోంది. శ్రద్దా కపూర్ ప్రభాస్ కు జోడిగా నటిస్తోంది. శ్రద్దా కపూర్ కుడా ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియోలకు అద్భుత స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

    మరో భారీ చిత్రం

    మరో భారీ చిత్రం

    సాహో తర్వాత ప్రభాస్ మరో భారీ చిత్రంలో నటించనున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు 1960 కాలం నాటి పరిస్థితుల్లో తెరకెక్కిస్తున్నాడు. సాహో చిత్రాన్ని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ త్వరలో ఇంస్టాగ్రామ్లోకి కూడా అడుగుపెట్టనునట్లు తెలుస్తోంది.

    English summary
    Prabhas to perform action sequence inspired from these Hollywood films in Saaho
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X