ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరో తెలుసా? ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లు ఏమే స్థానాల్లో ఉన్నారంటే..

Most Popular Indian Movie Stars: కంటెంట్ లో దమ్ముంటే.. అది చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా హిట్ కొడుతుంది. ఇలా సౌత్ ఇండియా మూవీ మేకర్స్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కించి.. దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఈ క్రమంలో అందులోని హీరో, హీరోయిన్స్ కు ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. నేషనల్ వైడ్ గా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మారుతున్నారు. ఇలా అత్యంత ప్రజాదారణ పొందిన స్టార్స్ జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్స్‌ మీడియా'(Ormax Media) నవంబర్ 2024 సర్వే రిపోర్టును విడుదల చేసింది . ఈ లిస్ట్ ప్రకారం ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోఎవరు? టాలీవుడ్ హీరోలు ఏఏ స్థానంలో నిలిచారో ఓ లూక్కేయండి.

సినిమా నచ్చితే చాలు .. భాషా బేధం లేకుండా ఆదరిస్తున్నారు సినిమా ప్రేమికులు. ఒకప్పుడు దక్షిణాది హీరోలకు బాలీవుడ్ బాక్సాఫీస్ లో చోటు దక్కేది కాదు. సౌత్ సినిమాలకు నార్త్ లో మార్కెట్ ఉండేది కాదు. కానీ, గత దశాబ్ద కాలం నుంచి పరిస్థితులు మారిపోయాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారితే.. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక కన్నడ స్టార్ యష్ కే జి ఎఫ్ మూవీ తో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్ వసూలు చేశారు. అలాగే.. RRR మూవీతో రామ్ చరణ్ ఎన్టీఆర్ లు ఫ్యాన్ ఇండియా నే కాకుండా గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన దేవర మూవీకి కూడా ఎన్టీఆర్ కు ఎనలేని రెస్పాన్స్ వచ్చింది.

Prabhas top in Ormax Media s Most Popular Indian Movie Stars List Of November 2024 allu arjun ram charan ntr follows

తాజాగా పుష్ప 2 మూవీ ట్రైలర్ ను పాట్నాలో రిలీజ్ చేసి పలు రికార్డులను బ్రేక్ చేశారు. ఇలా సౌత్ ఇండియా సినిమాలకు కూడా పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ క్రియేట్ అయ్యాయి. దీంతో ఇందులో నటించే స్టార్స్ కు కూడా ఇండియా వైస్ గా పాపులారిటీ వచ్చేసింది. తాజాగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్స్‌ మీడియా'(Ormax Media) నవంబర్ 2024 సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ సంస్థ తన సర్వేలో ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్‌ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో కేవలం ఇద్దరు బాలీవుడ్ హీరోలకు మాత్రమే చోటు దక్కిందటంటే అర్థం చేసుకోవచ్చు.

ఈ జాబితా ప్రకారం ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో గా మొదటి స్థానంలో యంగ్ రెబల్ స్టార్ నిలిచారు. డార్లింగ్ ప్రభాస్.. పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నారు. ఇటీవల కల్కి మూవీ హిట్ తో మరో సారి పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకున్నారు. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ చేతిలో మూడు సినిమాలుగా .. మరో మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా బిజీబిజీగా మారారు ప్రభాస్. అత్యంత పాపులారిటీ స్టార్ గా ప్రభాస్ మొదటి సారిగా నిలిచారు.

ఇక రెండో స్థానంలో విజయ్, మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారు. నాలుగో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ . ఐదో స్థానంలో అజిత్ నిలిచారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆరో స్థానం లో నిలిచారు. ఆ తరువాత ఏడో స్థానంలో మహేష్ బాబు, ఎనిమిదో స్థానంలో తమిళ స్టార్ హీరో సూర్య, తొమ్మిదో స్థానంలో గోబల్ స్టార్ రామ్ చరణ్, చివరిగా 10 స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు మాత్రమే చోటు దక్కింది. గత నెలలో అక్షయ్ కుమార్ టాప్ టెన్ లో నిలిచారు గానీ. ఈ సారి ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. పుష్ప 2, గేమ్ ఛేంజర్ రీలిజ్ అయినా తరువాత అల్లు అర్జున్, రామ్ చరణ్ స్థానాలు మెరుగు పడే అవకాశముంది.

More from Filmibeat

Read more about: allu arjun prabhas shah rukh khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X