దూసుకుపోతున్న ప్రభాస్.. వెంటాడుతున్న అల్లు అర్జున్.. సౌత్ ఇండస్ట్రీలో వార్ వన్‌సైడేనా!

సమకాలీన పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లక్షల్లో ఉండే ఫాలోవర్స్ మాత్రమే ఏ సినిమా హీరో ఫ్యాన్ స్టామినా తెలియజెప్పుతున్నాయి. అందుకే హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలోకి ప్రవేశించి తమ స్టామినా నిరూపించుకొంటున్నారు. ఈ రేసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో వారి స్టామినా ఏ రేంజ్‌లో ఉందంటే..

సోషల్ మీడియాలో యువ, సీనియర్ హీరోల హల్‌చల్

సోషల్ మీడియాలో యువ, సీనియర్ హీరోల హల్‌చల్

టాలీవుడ్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో యువ హీరోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కుర్ర హీరోలను చూసిన సీనియర్ హీరోలు కూడా లేటైనా లేటెస్ట్‌గా రంగంలోకి దూకారు. ఇటీవల సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా స్పందిస్తున్నారు. ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకొంటూ హల్‌చల్ చేస్తున్నారు.

దక్షిణాదిలోనే ప్రభాస్ నంబర్ వన్

దక్షిణాదిలోనే ప్రభాస్ నంబర్ వన్

ఇక ప్రభాస్ కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చినప్పటికీ.. తనకున్న క్రేజ్‌తో సోషల్ మీడియాలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్‌తో యంగ్ రెబల్‌స్టార్ దూసుకెళ్తున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలోనే ప్రభాస్ టాప్ రేంజ్‌లో ఉన్నారు. ఇది ప్రభాస్‌కు ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉందని చెప్పడానికి నిదర్శనంగా మారింది.

రెండోస్థానంలో అల్లు అర్జున్

రెండోస్థానంలో అల్లు అర్జున్


ఇక ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్‌కు 13.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణాదిలో అల్లు అర్జున్‌కు బలమైన ఫ్యాన్ బేస్ ఉండటమే కారణం. ముఖ్యంగా ఆయనకు మలయాళంలో భారీగా అభిమానులు ఉండటంతో రికార్డు స్థాయి ఫాలోవర్స్ ఉండటానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మహేష్, రాంచరణ్ పరిస్థితి ఇది

మహేష్, రాంచరణ్ పరిస్థితి ఇది

ఇక మిగితా హీరోల విషయానికి వస్తే ఫేస్‌బుక్‌లో మహేష్ బాబుకు సుమారు 8 మిలియన్ల ఫాలోవర్స్, రాంచరణ్‌కు 7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మిగితా హీరోలకు అంతంతా మాత్రమే ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ప్రాధాన్యం గుర్తించిన హీరో, హీరోయిన్లు తగిన చర్యలు తీసుకొని సొంతంగా టీమ్‌లను ఏర్పాటు చేసుకొంటున్నారు.

ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే..

ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే..


ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. తన కెరీర్‌లో 20 చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమవుతున్నది. త్వరలోనే మిగిలి ఉన్న సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పుష్పలో అల్లు అర్జున్

పుష్పలో అల్లు అర్జున్


అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. అల వైకుంఠపురంలో చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో జతకట్టారు. చిత్తూరు జిల్లా నేపథ్యంగా సాగే అక్రమ కలప వ్యాపారం బ్యాక్ డ్రాప్‌గా పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ సినిమా కోసం గెటప్ పరంగా అల్లు అర్జున్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X