twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్వే : పవన్, మహేష్ వెనక్కి....ప్రభాస్ నెం.1

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో యూత్‌ను ఆకట్టుకునే హీరోలు ఎవరంటే కామన్‌గా ముందుకుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఓ సర్వేలో నెం.1 స్థానంలో నిలిచాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఓ ప్రముఖ దిన పత్రిక హైదరాబాద్‌లో నిర్వహించిన యూత్ ఐకాన్ సర్వేలో ఎక్కువ మంది ప్రభాస్‌కే ఓటేసారు. ప్రభాస్‌కి 16.2 % ఓట్లు పడగా, 15.9% ఓట్లతో మహేష్ బాబు రెండో స్థానంలో, 15.4% ఓట్లతో పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సుగల యువకులు 1000 మంది పాల్గొన్నారు.

    యూత్ ఐకాన్ సర్వే వివరాలు...

    టాలీవుడ్ హీరోల్లో యూత్ ఐకాన్
    1. ప్రభాస్ : 16.2 %
    2. మహేష్ బాబు : 15.9%
    3. పవన్ కళ్యాణ్ : 15.4 %

    బాలీవుడ్ హీరోల్లో యూత్ ఐకాన్..
    1. సల్మాన్ ఖాన్ : 50%
    2. అమీర్ ఖాన్ : 14.4 %
    3. అమితాబ్ బచ్చన్ : 13.9%
    4. హృతిక్ రోషన్ : 13.4%
    5. షారుక్ ఖాన్ : 12.6%

    మరి ఈ సర్వేల సంగతి పక్కన పెడితే...ఈ లెక్కలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులకు కోపం తెప్పిస్తోంది. మా హీరో నెం.1 అని పవన్ కళ్యాణ్ అభిమానులు, నెం.1 స్థానానికి మహేష్ బాబే అర్హుడని మహేష్ అభిమానులు బలంగా వాదిస్తున్నారు.

    English summary
    
 According to “Youth ICON Survey” published by one of the telugu daily recently, reveals some shocking facts about Telugu film industry and other fields . Till now, every one thought either Pawan Kalyan or Mahesh Babu would be the “Youth ICON” but surprisingly Prabhas emerged as Youth ICON for Hyderabadis followed by Mahesh Babu in second place and Pawan Kalyan pushed to third place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X