twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నదిలో విద్యార్థుల గల్లంతుపై స్పందిస్తూ ప్రభాస్ ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద ఉధృతికి కొట్టుకు పోయి 24 మంది హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయిన సంగతి తెలిసిందే. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి చెందిన వీరంతా ఎడ్యుకేషనల్ టూర్ నిమిత్తం అక్కడికి వెళ్లారు. బియాస్ నది వద్ద ఫోటోలు దిగుతుండగా లర్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యాం గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదలో వారు కొట్టుకుపోయారు.

    కాగా...ఈ ఘటనపై తెలుగు సినిమా నటుడు ప్రభాస్ ట్విట్టర్ ద్వార స్పందించారు. 'ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం విషాదకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి విద్యార్థుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉండటంతో విషాదం చోటు చేసుకుంది.

    Prabhas tweet about Himachal Pradesh Following River Tragedy

    ప్రమాదం నుండి బయట పడ్డ 22 మంది విద్యార్థులను మనాలి నుంచి చండీగడ్ తరలించారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్లు మండి ఎస్పీ చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపుచర్యలు నిలిపేసినట్లు ఆయన తెలిపారు.

    <blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Very sad to hear about d tragedy.My prayers with all the families of HYDstudents,who lost their lives in Himachal- <a href="https://twitter.com/search?q=%23Prabhas&src=hash">#Prabhas</a></p>— Prabhas (@Prabhas_Team) <a href="https://twitter.com/Prabhas_Team/statuses/475914257167810563">June 9, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

    బియాస్ నదీ తీరాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనుమతి లేకుండా లర్జీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన ఐదుగురు అదికారులను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.

    English summary
    Prabhas tweet about Himachal Pradesh Following River Tragedy. "Very sad to hear about d tragedy.My prayers with all the families of HYDstudents,who lost their lives in Himachal" he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X