కొరటాల శివ తో ప్రభాస్ కొత్త చిత్రం వివరాలు..!?
డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్" లాంటి సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' సినిమా షూటింగ్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మరో కొత్త సినిమా తీయనున్నాడు. నోటెడ్ డైలాగ్ రైటర్ కొరటాల శివతో, హీరో ప్రభాస్ ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. చిత్ర షూటింగ్ అక్టోబర్ మూడవ వారం నుండి మొదలవుతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాను వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో పలుచిత్రాలకు సూపర్ డూపర్ హిట్ సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రభాస్ ప్రక్కన ఇద్దరు అగ్ర కధానాయికలు నటించబోతున్నారు. ఈ మూవీ యక్షన్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో ప్రకటిస్తారు. కొరటాల శివ, ఈ చిత్రంతో ఒక దర్శకుడు గా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఇంతకు ముందు శివ, బృందావనం, మున్నా, భద్ర మరియు ఊసరవెల్లి వంటి టాప్ సినిమాలకు డైలాగ్ రచయితగా పని చేసారు.


Click it and Unblock the Notifications











