Prabhas: సలార్ 2 కూడా ఫిక్స్ అయినట్లే.. రిలీజ్ ఎప్పుడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం సలార్. ఈ బిగ్గెస్ట్ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇతర అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది మూవీ టీం. అయితే రిలీజ్ సమయంలో ఇతర బిగ్ మూవీస్ రాకుండా జాగ్రత్త పడుతున్నారట నిర్మాతలు.
భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ కరెక్ట్ టైం కే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సలార్ పార్ట్ 1 చిత్రాన్ని 2023 లోనే విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సలార్ విడుదల అయిన తర్వాత మరో 3 వారాల పాటు మరో పెద్ద సినిమా రాకుండా చూసుకుంటున్నారట.

కేవలం తెలుగు, కన్నడలో మాత్రమే కాకుండా మరే ఇతర భాషలకు చెందిన మూవీస్ కూడా రాకుండా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. దాదాపు పూర్తి కావొచ్చిన సలార్ మూవీ రన్ టైం 3 గంటలు ఉందని అంటున్నారు. సలార్ సినిమా షూటింగ్ ఈ ఏడాది మే కల్లా పూర్తి అవుతుందని సమాచారం.
అలాగే పార్ట్-1 2023లో విడుదల చేసి.. పార్ట్-2 షూటింగ్ ను ప్రారంభిస్తారట. దాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించి మూడేళ్ల తర్వాత అంటే 2026లో సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది. పుష్ప సినిమా పార్ట్-1, పార్ట్-2కు వచ్చినట్లుగానే ఈ చిత్రానికి కూడా ఎక్కువ కాలం గ్యాప్ ఇవ్వబోతన్నట్లు సమాచారం. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ బంపర్ హిట్లు అందుకోగా.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.
సలార్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని మూవీ మేకర్స్ తో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ చాలా అంచనాలతో ఉన్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరీ మూడేళ్లు కాకుండా కొంచెం త్వరగా పార్ట్2 ని కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











