ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ టీజర్ ఎంతవరకు వచ్చిందంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సలార్. ఈ మూవీ షూటింగ్ కంప్లేట్ అయిపొయింది. ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే పెండింగ్ ఉన్న ప్యాచ్ వర్క్ ప్రభాస్ కాల్ షీట్స్ చూసుకొని పూర్తిచేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సలార్ రెండు భాగాలుగా ఉండబోతోంది. మొదటి భాగంగా సలార్ ది సాగ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. దీని సీక్వెల్ 2025లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదిపురుష్ బజ్ కంప్లీట్ గా క్లోజ్ కావడంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ సలార్ మీద దృష్టి పెట్టారు.

ఈ మూవీకి సంబందించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ కూడా సలార్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచాలని అనుకుంటున్నారు. బిజినెస్ కూడా స్టార్ట్ చేయడానికి నిర్మాత సిద్ధం అవుతున్నారు. ఇక టీజర్ కోసమే డిస్టిబ్యూటర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. టీజర్ తో మూవీపి దేశ వ్యాప్తంగా ఒక వేవ్ క్రియేట్ చేయాలని ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీజర్ కి సంబంధించి ఫైనల్ రికార్డింగ్ వర్క్ కూడా మొదలు పెట్టారంట. జులై7న లేదంటే a నెల రెండో వారంలో సలార్ టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబందించిన అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇక సలార్ టీజర్ ని గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నారంట. టీజర్ తర్వాత ఈ చిత్రంపై కనీసం 500 కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











