ప్రభాస్ రాధేశ్యామ్ టైటిల్ వెనుక గోపిచంద్ డైరెక్టర్.. ఎవరు సజెస్ట్ చేశారో తెలుసా?

బాహుబలి అనంతరం ప్రభాస్ రేంజ్ పెరగడంతో ఆ తరువాత వస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎంతగానో బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. సాహో కోసం యూవీ క్రియేషన్స్ ఎంతగా కష్టపడిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు అనుకున్న దానికంటే డబుల్ బడ్జెట్ పెట్టారు. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక రాధేశ్యామ్ విషయంలో అలా జరగకూడదని చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తోంది.

టైటిల్ సజెస్ట్ చేసింది ఎవరు?

టైటిల్ సజెస్ట్ చేసింది ఎవరు?

జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ టైటిల్ ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ - పూజా హెగ్డే రొమాంటిక్ లుక్స్ తో పాటు సినిమా టైటిల్ కూడా ఆడియేన్స్ కి బాగా నచ్చేసింది. దీంతో ఆ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ సినిమా కోసం ఇదివరకే కొన్ని టైటిల్స్ ని అనుకోని మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

ఆ టైటిల్స్ క్యాన్సిల్..

ఆ టైటిల్స్ క్యాన్సిల్..

జాను అనే టైటిల్ ఆల్ మోస్ట్ సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో దాన్ని సమంత, శర్వానంద్ సినిమా కోసం దిల్ రాజు తీసేసుకున్నాడు. ఇక ఆ తరువాత మరో నాలుగైదు టైటిల్స్ కోసం చర్చలు జరిపినప్పటికి వర్కౌట్ కాలేదు. చివరికి దర్శకుడు రాధా కృష్ణ రాధే శ్యామ్ అనే టైటిల్ చెప్పడంతో నిర్మాతలు అలాగే ప్రభాస్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

గోపిచంద్ డైరెక్టర్ సలహా..

గోపిచంద్ డైరెక్టర్ సలహా..

అసలు మ్యాటర్ లోకి వెళితే.. దర్శకుడు రాధా కృష్ణకు ఈ టైటిల్ సెట్ చేయడానికి కారణం తన గురువట. గోపిచంద్ తో ఒక్కడున్నాడు, సాహసం వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వద్ద రాధాకృష్ణ శిష్యరికం చేశాడు. అయితే ఇటీవల టైటిల్ కోసం చంద్రశేఖర్ ని సంప్రదించగా ఆయన రాధే శ్యామ్ అనే టైటిల్ ని ఫిక్స్ చెసుకొమ్మని చెప్పాడట.

రిలీజైన కొన్ని గంటల్లోనే..

రిలీజైన కొన్ని గంటల్లోనే..

కథలోని పాత్రలకు తగ్గట్టుగా రాధే శ్యామ్ టైటిల్ కాస్త క్యాచిగా అనిపించడంతో ఎవరు కూడా ఆ టైటిల్ పై అభ్యంతరం చెప్పలేదు. మొత్తానికి ఏడాది పాటు టైటిల్ విషయంలో సతమతమైన చిత్ర యూనిట్ కి దర్శకుడు చంద్రశేఖర్ మంచి ఐడియా ఇచ్చాడు. ఇక రాధేశ్యామ్ టైటిల్ ప్రభాస్ అభిమానులకు బాగా నచ్చేసింది. రిలీజైన కొన్ని గంటల్లోనే టైటిల్ ట్రెండింగ్ లిస్ట్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X