Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్‌కు మళ్ళీ బాహుబలి లాంటి కష్టాలు.. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం..
రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇక పాన్ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని చాలా ఈజీగా అర్ధమయ్యింది. నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో ఒక రొమాంటిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్న డార్లింగ్ ఆ సినిమా షూటింగ్ ని చా సరదాగా ఫినిష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ సీన్స్ కూడా ఉండవట. ఫైట్స్ అసలే ఉండవని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ న్యాచురల్ గా తనలోని రొమాంటిక్ యాంగిల్ ని చూపిస్తున్నాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే డిసెంబర్ లోపు ఎలాగైనా రాధేశ్యామ్ ప్రాజెక్టును ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ తరువాత ఒక వారం గ్యాప్ తీసుకొని ఆదిపురుష్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది.
దర్శకుడు ఓం రావత్ ఇప్పటికే తన టీమ్ తో కలిసి రామాయణ కాలం నాటి సెట్స్ యొక్క స్కెచ్ వేసి రెడీగా ఉంచారట. జనవరిలోనే రెగ్యులర్ వర్క్ మొదలయ్యే అవకాశం ఉందట. ఇక ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించాలి కాబట్టి లుక్ తో పాటు ఫిట్నెస్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందట.
మరి ఎక్కువ కాకుండా అలాగని తక్కువ కాకుండా ఒక న్యూ లూక్ ఫిట్నెస్ కోసం కసరత్తులు చేయనున్నాడట. దాదాపు రెండు నెలల వరకు మళ్ళీ డైట్ కొనసాగించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పూర్తిగా 3డి టెక్నాలజీతో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇక సీత పాత్ర కోసం కీయరా అధ్వానీని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. రావణుడి పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.