twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Salaar: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ సర్‌ప్రైజ్ రెడీ.. ఎప్పుడంటే?

    |

    బాహుబలి సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ తదుపరి సినిమాలతో అయినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవాలి అనే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాలలో చాలా ఎక్కువ మంది అభిమానుల ఫోకస్ మాత్రం సలార్ సినిమా పైనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాను KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.

    తప్పకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఊహించని రేంజ్ లోనే ఉంటాయి అని ప్రేక్షకులలో బలమైన నమ్మకం అయితే ఉంది. ఇదివరకే విడుదల చేసిన కొన్ని పోస్టర్స్ కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని పెంచేశాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ మాత్రమే ప్రభాస్ ను మాస్ ఎలివేషన్స్ తో ఆడియెన్స్ కు నచ్చే విధంగా చూపిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు.

    Prabhas upcoming salaar movie official announcement date fix

    ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు కొంత ఆలస్యం చేస్తుంది అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఇక ఎట్టకేలకు చిత్ర నిర్మాణ సంస్థ హోంబెలే ఫిలిమ్స్ వారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక అధికారిక అనౌన్స్మెంట్ ను ఈనెల 15వ తేదీన ఉంటుంది అని తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆరోజున మధ్యాహ్నం 12:58 కి రాబోయే ఆ అనౌన్స్మెంట్ అభిమానులకు మంచి కిక్ అయితే ఇస్తుంది అని తెలుస్తోంది.

    ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏమిటి అనే విషయంలోకి వెళితే మాత్రం ఒక స్పెషల్ టీజర్ తో పాటు విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరుస్తాడో లేదో చూడాలి. ఇక సలార్ సినిమా కంటే ముందుగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రామాయణం కథలో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కానీ ఇంతవరకు సరైన అప్డేట్ అయితే మళ్లీ రాలేదు. మరి ఆ ప్రాజెక్టు విషయంలో ప్రభాస్ టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

    English summary
    Prabhas upcoming salaar movie official announcement date fix
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X