సునీల్ వాడిన ఇంట్లోకి ప్రభాస్
రాజమౌళి-సునీల్ కాంబినేషన్లో వచ్చిన మర్యాద రామన్న సినిమా కోసం రాయలసీమ శైలిలో ఓ ఇంటి సెట్ వేసిన సంగతి తెలిసిందే. మర్యాద రామన్న సినిమాకు ఆ సెట్ హైలెల్ గా నిలిచింది. తాజాగా అదే ఇంటిని తన సినిమాకు వాడుకుంటున్నాడు యంగ్ హీరో ప్రభాస్. ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్లో 'వారధి' సినిమా రూపొందుతోంది. జనవరి 16నుంచి మర్యాద రామన్న ఇంట్లోనే ప్రభాస్ 'వారధి' షూటింగ్ మొదలు కానుంది. ఇది హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ సమీపంలోని కొత్తపేటలో ఉంది. ఈ ఇంటి సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
వారధి చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ లీడ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు లారెన్స్ దర్వకత్వంలో రూపొందుతున్న రెబల్ చిత్రంలోనూ ఒకేసారి నటిస్తున్నాడు ప్రభాస్. మరో రెండు మూడు నెలల్లో రెబల్ విడుదలకు సిద్ధం అవుతుండగా, 2012 ద్వితీయార్థంలో 'వారధి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











