For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    ప్రభాస్ వారధి... ఇప్పుడు ‘మిర్చి’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఇప్పటి వరకు వారధి అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగించిన ఈచిత్రానికి 'మిర్చి' అనే టైటిల్ ఖరారు చేసారు.

    మిర్చి చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తోందిన ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చారు. తాజాగా ఈచిత్ర రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్లో ఆడియో విడుదల చేయనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.

    ఇక ప్రభాస్-తమన్నా, దీక్షాసేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'రెబల్' చిత్రం సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలతో జోరుమీదున్న ప్రభాస్ 'రెబల్' చిత్రంతో హాట్రిక్ కొడదామనుకున్నాడు. కానీ లారెన్స్ చేసిన అతి వల్ల సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచలేక పోయింది.

    'రెబల్' చిత్రం ప్లాప్ టాక్‌తో చిన్నబోయిన ప్రభాస్ సంక్రాంతి రేసులో పుంజుకుంటాడని, మిర్చి చిత్రంతో మళ్లీ ప్రభాస్ పుంజుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న కొరటాల శివ ప్రభాస్ అభిమానుల నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడతాడో చూడాలి.

    English summary
    Young Rebel Star Prabhas’s ‘Vaaradhi’ is now going to be known as ‘Mirchi’. The film is being produced by U.V. Productions Corporation. Prabhas will be appearing in the lead role with Anushka and Richa Gangopadhyay. Koratala Siva is the director.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more