twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘వారధి’ నెక్ట్స్ షెడ్యూల్ డీటేల్స్

    By Bojja Kumar
    |

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... లారెన్స్ దర్శకత్వంలో 'రెబెల్' చిత్రం తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'వారధి' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'వారధి' చిత్రం ఆగస్టు రెండో వారం నుంచి తర్వాతి షెడ్యూల్ జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది.

    ఈ షెడ్యూల్‍‌లో ప్రభాస్‌తో హీరోయిన్లు అనుష్క, రీచా గంగోపాధ్యాయపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు సీన్లు చిత్రీకరించనున్నారు. అదే విధంగా పొల్లాచ్చిలో ఓ పాట చిత్రీకరణ జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈచిత్రం దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అన్న పూర్ణ స్టూడియోలో రెబెల్ షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రభాస్ 'వారధి' షూటింగులో జాయిన్ కానున్నాడు.

    ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి. ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

    'వారధి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నామని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మరో మంచి టైటిల్ కోసం వెతుకున్నామని చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు.

    English summary
    Young rebel star Prabhas will resume shooting for his upcoming love and family entertainer Varadhi (tentatively titled) from August 2nd week. The unit will film scenes on Prabhas and Anushka and Richa Gangopadhyay in this schedule in Hyderabad and are likely to shoot a song in Pollachi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X