ప్రభాస్ ‘వారధి’కి బ్రేక్

By Bojja Kumar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి 'వారధి'(వర్కింగ్ టైటిల్) రచయిత కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉంది.

ఇటీవల రామోజీ పిల్మ్ సిటీలో, కొత్త పేటలోని మర్యాద రామన్న ఇంట్లో షూటింగ్ పూర్తి చేసుకోగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సీన్లు చిత్రీకరించారు. తాజాగా ఈ చిత్రం షూటింగుకు తాత్కలికంగా బ్రేక్ పడింది. ప్రభాస్ మరో వైపు లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో 'రెబల్' షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ బ్రేక్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తిరిగి 'వారధి' చిత్రం జూన్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వారధి చిత్రానన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ చిత్రం ద్వారా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.

వారధి షూటింగుకు బ్రేక్ పడటంతో ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రీచా గంగోపాధ్యాయ కొంత కాలం అమెరికాలో గడిపేందుకు వెలుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X