ప్రభాస్ 'వారధి' స్టోరీ లైన్ ఏంటి?
ప్రభాస్, అనుష్క కాంబినేషనలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వారధి'. ఈ చిత్రంలో కథ గురించి ప్రభాస్ మాట్లాడుతూ... మనసు, అద్దం రెండూ ఒక్కటే. ఒక్కసారి ముక్కలైపోతే మళ్లీ అతుక్కోవు అంటుంటారు. కానీ అలాంటి మనసులకూ మరమ్మత్తులు చేశాడో యువకుడు. అతని కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మరో హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్ నిర్మాతలు.
ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. రైల్వేస్టేషన్ నేపథ్యంగా ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో వాటిని షూట్ చేస్తున్నారు. ''మనసుల్ని కలిపే వారధి లాంటి యువకుడి కథ ఇది. సున్నితమైన భావోద్వేగాలతో అల్లుకొన్న ఈ కథలో కావల్సినంతగా యాక్షన్ అంశాలుంటాయి. ప్రభాస్‌ని కొత్తగా చూపించబోతున్నాము''అన్నారు నిర్మాతలు. సత్యరాజ్, నదియా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్‌కుమార్ రాజు, ఛాయాగ్రహణం: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
ఈ చిత్రంతో పాటు ప్రభాస్ 'రెబల్' చిత్రం కూడా చేస్తున్నారు. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అతని పాత్ర ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి చెపుతూ...అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్.
'రెబల్'లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫైట్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్ లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ''రెబల్ అని పిలిపించుకొనే ఆ యువకుడి లక్ష్యం ఏమిటి? ఆ పేరు అతనికి ఎందుకొచ్చింది? అనేది కథలో ఆసక్తికరమైన అంశం. ప్రభాస్ శైలికి అనుగుణంగా ఉండే కథ ఇది. యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని''చెప్పారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











